Kaizer News

రోడ్డు ప్రమాద మృతుడిని గుర్తించిన పోలీసులు

రోడ్డు ప్రమాద మృతుడిని గుర్తించిన పోలీసులు

· State - Telangana · prabhanews.com

మమత మెడికల్‌ కాలేజీ న్యూరో సర్జరీ విభాగాధిపతిగా గుర్తింపు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలింపు సూర్యాపేట, ఆంధ్రప్రభ: ఖమ్మం–హైదరాబాద్‌ జాతీయ రహదారి 365 బీబీపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మృతుడు ఖమ్మం జిల్లా కేంద్రంలోని మమత మెడికల్‌ కాలేజీ న్యూరో సర్జరీ విభాగాధిపతి కే. జగదీష్‌ బాబుగా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం కావడంతో మృతుడి వివరాలను గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సూర్యాపేటకు చెందిన వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం వారు అక్కడి నుంచి జనరల్‌ ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News