Kaizer News

Proddatur: ఎన్నికల సామాగ్రి భద్రతపై ప్రొద్దుటూరు క

Proddatur: ఎన్నికల సామాగ్రి భద్రతపై ప్రొద్దుటూరు కమిషనర్ కీలక ఆదేశాలు

· State - Telangana · hmtvlive.com

Shorts Proddatur: ​ప్రొద్దుటూరు రాబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ప్రొద్దుటూరు మున్సిపల్ యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఎన్నికల సామాగ్రి భద్రత మరియు నిల్వ కేంద్రాల ఏర్పాటుపై మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఇంజనీరింగ్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ​ ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణంలో ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో మరియు నిష్పక్షపాతంగా నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికల సామాగ్రికి ఎలాంటి భంగం వాటిల్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ​ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్‌తో పాటు పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News