Kaizer News

Anakapalle: క్రిటికల్ కేర్ విభాగాన్ని పరిశీలించిన

Anakapalle: క్రిటికల్ కేర్ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే!

· State - Telangana · hmtvlive.com

Shorts Anakapalle: ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన క్లిష్టతర వ్యాధుల సంరక్షణ అత్యవసర వైద్య సేవల విభాగాన్ని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, క్లిష్టతరమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ప్రత్యేక క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి వచ్చిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే రోగులకు 24 గంటల పాటు నిరంతర వైద్య పర్యవేక్షణ, అవసరమైన ఐసీయూ (ICU) వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్రిటికల్ కేర్ విభాగంలో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, ఆధునిక మానిటర్లు, ఇతర అత్యవసర వైద్య సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించే విధంగా వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, వైద్యులు, వివిధ విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News