‘నేను స్టార్స్‌తో సినిమాలు నిర్మించాను. కానీ పిల్లలతో ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ సంతోషంగా సంతృప్తిగా అనిపించింది. ఇందులో పాటలు చాలా బాగుంటాయి. సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి చక్కటి పాటలిచ్చాడు. దర్శకుడు శ్రీకర్ అద్భుతంగా ఆ పాటలను తెరకెక్కించాడు. ప్రస్తుతం సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఈ పోటీలో రిలీజ్ చేయాల్సిన జానర్ కాదిది. అందుకే ఇంటిల్లిపాదీ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడగలిగే డేట్ చూసి రిలీజ్ చేస్తాం’ అని నిర్మాత ధీరజ్ మొగిలినేని అన్నారు