Kaizer News

మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శం: ముఫ్తి ఘి

మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శం: ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్

· State - Telangana · prabhanews.com

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శమని మజ్లిస్ తహఫుజ్ ఖత్మె నబువ్వత్ ట్రస్ట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ అన్నారు. రబీవుల్ అవ్వల్ మాసం సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని చింతలవాడ క్రిస్టల్ గెస్ట్‌హౌస్‌లో సఫా బైతుల్ మాల్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై ‘సీరతున్నబి’ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్ పర్యవేక్షణలో మౌలానా లయీఖుల్లా, మౌలానా ఇంతియాజ్ ఖాన్ అసాధి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్ మాట్లాడుతూ.. సఫా బైతుల్ మాల్ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను రాబోయే తరాలకు, యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల మేధస్సును పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలానా ఇంతియాజ్ ఖాన్ అసాధిని అభినందించారు. టాలెంట్ టెస్ట్‌కు హాజరైన విద్యార్థులకు త్వరలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఫ్తి షఫీక్, మౌల్వి ఫైజాన్, మౌలానా సాబీర్ ఆలం, హాఫిజ్ ఆమిర్, ఖత్మె నబువ్వత్ కరీంనగర్ కార్యకర్తలు కలీమ్ షరీఫ్, ముఖర్రం, మహమ్మద్ రఫీ, హాఫిజ్ అబ్దుల్ రాఫె తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News