మెండోరా, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలంలోనీ వెల్గటూర్ గ్రామంలో శనివారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోషకాహారంతో ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కావ్య సతీష్, మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బద్దం శ్రీనివాస్, సూపర్‌వైజర్ అనురాధ, ఏఎన్‌ఎం ప్రమీల, అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణులు, చిన్నారులు పాల్గొన్నారు