Anantapur: అనంతపురం టౌన్‌లో తృటిలో ఘోర కారు ప్రమాదం తప్పింది. చెరువు కట్ట సమీపంలోని షిర్డీ సాయిబాబా కళ్యాణ మండపం వద్ద ఫోర్డ్ ఫిగో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. KA 51 HA 0880 నంబర్ గల కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంజన్ నుంచి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. క్షణాల్లోనే మంటలు కారంతటా వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.అయితే మంటలను ముందుగానే గుర్తించిన కారులోని ప్రయాణికులు వెంటనే వాహనం నుంచి బయటకు దిగారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కారు దగ్ధం కావడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది