Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ హైవేపై వంట చేస్తూ వీడియోలు ట్రక్ డ్రైవర్ జీవితాన్ని మార్చేసిన కొడుకు ఐడియా Follow Us : --> Add as a preferred source on google Jamtara Truck Driver Rajesh Rawani Success Story: సాధారణంగా ట్రక్ డ్రైవర్‌గా జీవనం సాగించే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారితే ఎలా ఉంటుంది? జార్ఖండ్‌లోని జామ్తాడాకు చెందిన రాజేష్ రావణి కథ ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. సుమారు 25 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ట్రక్ నడుపుతున్న ఆయన.. ఇప్పుడు ‘R Rajesh Vlogs’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ట్రక్ డ్రైవింగ్‌తో పాటు హైవేపై వంట చేయడం, తన రోజువారీ జీవితాన్ని వీడియోల రూపంలో చూపించడం ద్వారా రాజేష్ డిజిటల్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆదాయం కూడా గతంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. రాజేష్ రావణి చాలా కాలంగా సుదీర్ఘ ట్రక్ ప్రయాణాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రయాణాల సమయంలో రోడ్డు పక్కన స్వయంగా వంట చేసుకునేవారు. చికెన్, మటన్, చేపలు, పనీర్ వంటి వంటకాలను తయారు చేసి వాటి ఫొటోలు, చిన్న వీడియోలను కుటుంబ సభ్యులతో షేర్ చేసేవారు. 2021లో ఆయన కుమారుడు సాగర్ రావణి ఈ వీడియోల్లో కొత్త అవకాశాన్ని గుర్తించారు. తండ్రి చేస్తున్న వంటలను వీడియోలుగా ఎడిట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. మొదట్లో ఇవి రాజేష్ రోజువారీ జీవితం, ట్రక్ ప్రయాణాలు, వంటలకు సంబంధించిన సాధారణ వీడియోలుగానే ఉండేవి. అయితే క్రమంగా వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ప్రారంభమైంది. రాజేష్ వీడియోలను చూసిన ప్రేక్షకులు కేవలం హైవేపై ఆయన చేసే వంటలను మాత్రమే కాకుండా.. అసలు ఈ వంటలు చేస్తున్న ట్రక్ డ్రైవర్ ఎవరు? ఆయన జీవితం ఎలా ఉంటుంది? అనే విషయాలపై కూడా ఆసక్తి చూపడం ప్రారంభించారు. ఆయన ఫేస్ రివీల్ వీడియోకు భారీగా స్పందన వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆ వీడియో విడుదలైన 24 గంటల్లో సుమారు 4.5 లక్షల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. దీంతో రాజేష్ రావణి కంటెంట్‌కు మరింత గుర్తింపు వచ్చింది. ట్రక్ డ్రైవర్‌గా తన రోజువారీ జీవితాన్ని చూపిస్తూ చేసే వీడియోలు క్రమంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించకముందు రాజేష్ ప్రధాన ఆదాయం ట్రక్ డ్రైవింగ్‌పైనే ఆధారపడి ఉండేది. తనకు అప్పట్లో నెలకు సుమారు రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ఆదాయం వచ్చేదని ఆయన చెప్పినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే యూట్యూబ్ ఛానల్ పాపులర్ అయిన తర్వాత ఆయన ఆదాయంలో గణనీయమైన మార్పు వచ్చినట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం, ప్రస్తుతం రాజేష్ రావణి నెలవారీ ఆదాయం సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండొచ్చని పేర్కొంటున్నారు. కొన్ని నెలల్లో ఈ ఆదాయం రూ.18 లక్షల వరకు చేరిన సందర్భాలు కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రాజేష్ రావణి తన ట్రక్‌ను కూడా తన జీవనశైలి, సుదీర్ఘ ప్రయాణాలు, కంటెంట్ క్రియేషన్‌కు అనుగుణంగా కస్టమైజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రక్ ఆయనకు కేవలం ప్రయాణ