'టాక్సిక్' సినిమా రిలీజ్ కావడం, దానికి మన దగ్గర పూర్తిగా ఫ్లాప్ టాక్ రావడం మాటేమో గానీ తెలుగు వర్సెస్ కన్నడ ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియాలో రోత పుట్టిస్తున్నాయి. తెలుగు హీరోల అభిమానులు, కన్నడ హీరో అభిమానులు.. ఒకరి ఇండస్ట్రీ, హీరోలపై మరొకరు దారుణంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇది చూస్తున్న చాలామంది.. అసలేం జరుగుతోంది? ఎందుకిలా తిట్టుకుంటున్నారు? అని అసహ్యపడుతున్నారు. ఇన్నాళ్లు సోషల్ మీడియాకే పరిమితమైన ఈ సమస్యకు యష్ తల్లి పుష్ప ఇప్పుడు మరింత ఆజ్యం పోసినట్లు కనిపిస్తున్నారు. (ఇదీ చదవండి: టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం.. అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ) బెంగళూరులో ఆదివారం, కన్నడ మీడియాతో మాట్లాడిన ఈమె.. యష్ ఎవరు? అని గతంలో తన కొడుకుపై వచ్చిన విమర్శలకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. ''కేజీఎఫ్'కు ముందు యష్‌కి వరసగా ఐదు హిట్స్ వచ్చాయి. మీరు అన్నట్లు అతడు అంత గుర్తింపులేని వాడయితే ఇప్పుడు అందరూ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. నా కొడుకు ఉగ్రవాదేం కాదు. అతడు అందరిలా ధనిక కుటుంబలో పుట్టలేదు. ఒక బస్ డ్రైవర్ కొడుకు. తన సొంత కృషితో ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఓ తల్లిగా నేను అతడిని చూసి గర్వపడుతున్నాను. యష్ సాధించిన విజయం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. కేజీఎఫ్‌కు ముందు కన్నడలో అతడు పడ్డ కష్టానికి ఫలితమే ఈ పాన్ ఇండియా స్టార్‌డమ్' అని యష్ తల్లి పుష్ప ఆవేశానికి లోనయ్యారు. ఈమె ఎవరి పేరు ప్రస్తావించనప్పటికీ అల్లు అరవింద్‌ని ఉద్దేశించే యష్ తల్లి ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంతా అనుకుంటున్నారు. ఎప్పుడో ఎవరో అన్న మాటలకు ఇప్పుడు ఈమె ఎందుకు రియాక్ట్ అయిందనేది అర్థం కాని విషయం. అలానే అల్లు అరవింద్, యష్ గురించి గతంలో ఏ ఉద్దేశంతో అన్నారో, ఈమెకు ఏం అర్థమైందో తెలీదు గానీ.. గత కొన్నిరోజుల నుంచి తెలుగు vs కన్నడ అభిమానుల మధ్య సాగుతున్న తగాదాలోకి ఇప్పుడు యష్ తల్లి వచ్చి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ సమస్య వ్యక్తిగతంగా మారేలా కనిపిస్తుంది. పోనీ ఈమె ఇంతలా ఎమోషనల్ అయినందుకైనా సినిమాకు ఏమైనా ప్లస్ అవుతుందా అంటే అస్సలు లేదు! 'టాక్సిస్' విషయానికొస్తే.. 'కేజీఎఫ్' తర్వాత యష్ దాదాపు నాలుగేళ్లు కష్టపడి ఈ మూవీ తీశాడు. విడుదలకు ముందు హడావుడి చేశారు గానీ కనీసం అంటే కనీసం కూడా బాగోలేదని చూసిన ప్రతిఒక్కరూ అంటున్నారు. అంతెందుకు కన్నడ హీరోలైన ఉపేంద్ర, రిషభ్ శెట్టి, సుదీప్ తదితరులు కూడా యష్ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు తప్పితే సినిమా బాగుందనే మాట అనలేదు. యష్ తల్లి పుష్ప మాత్రం తన కొడుకు మూవీని బయట ఇండస్ట్రీల్లోని కొందరు వ్యక్తులు కలిసి టార్గెట్ చేస్తున్నారని భ్రమపడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఒకవేళ మూవీనే హిట్ అయ్యింటే ఈమె ఈ కామెంట్స్ చేసేవారా? (ఇదీ చదవండి: రాసింది ఒకటి.. తీసింది మరొకటి.. ‘టాక్సిక్’ దర్శకురాలు ) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05) కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు) ఇరాన్ ఆర్థిక మూలాలపై ట్రంప్ వేట.. బ్యాంక్ మిస్ర్ క