Kaizer News

సింగరేణిలో ఆఫీసర్ల బదిలీలు, ప్రమోషన్లు

సింగరేణిలో ఆఫీసర్ల బదిలీలు, ప్రమోషన్లు

· State - Telangana · v6velugu.com

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో ఫైనాన్స్​ అండ్​ అకౌంట్స్​ విభాగంలో పని చేస్తున్న పలువురు ఆఫీసర్లను బదిలీ చేస్తూ సింగరేణి యాజమాన్యం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏజీఎలకు ప్రమోషన్లు కల్పిస్తూ జీఎంగా నియమించింది. జీఎం(ఎఫ్అండ్ఏ) సీహెచ్.మురళీధర్​ను కార్పొరేట్​ జీఎంగా బదిలీ చేశారు. కొత్తగూడెం ఏరియా ఏజీఎం ఎరుకలి బీభత్సను మంచిర్యాల జిల్లా జైపూర్​ సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​కు జీఎంగా, ఎస్​ఓటు డైరెక్టర్(ఫైనాన్స్​) ఏజీఎం గండి కొమురయ్యకు జీఎంగా ప్రమోషన్​ కల్పిస్తూ హైదరాబాద్​ ఆఫీస్​కు బదిలీ చేశారు. హైదరాబాద్​ ఆఫీస్​లో పని చేస్తున ఏజీఎం కుదురు కవితను కొత్తగూడెం కార్పొరేట్​ హెచ్​వోడీగా, శ్రీరాంపూర్​ ఏరియా ఏజీఎం పిన్నింటి సుమలతను కార్పొరేట్​కు, జైపూర్​ ఎస్టీపీపీ ఏజీఎం శ్రీధర్​ బంగలూరిని శ్రీరాంపూర్​ ఏరియాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగూడెం రీజియన్​లో కొనసాగుతున్న డీజీఎం సుధీర్​ను కొత్తగూడెం ఏరియాకు, బెల్లంపల్లి రీజియన్​ శ్రీరాంపూర్​ ఏరియా డీజీఎం ఎం.దామోదర్​రావును కార్పొరేట్​ ఫర్​చేంజ్​ విభాగానికి, మందమర్రి ఏరియా/హైదరాబాద్​ డీజీఎం కె.మధుబాబును బెల్లంపల్లి రీజియన్​ శ్రీరాంపూర్​ ఏరియాకు, కార్పొరేట్​ ఫర్​చేంజ్ డీజీఎం శీలం మోహన్​రెడ్డిని కొత్తగూడెం రీజియన్​కు యాజమాన్యం బదిలీ చేసింది

Original source: v6velugu.com
Read more on Kaizer News