Kaizer News

Rajahmundry: రాజమహేంద్రవరంలో వైభవంగా శోభిత్ వర్మ వ

Rajahmundry: రాజమహేంద్రవరంలో వైభవంగా శోభిత్ వర్మ విగ్రహావిష్కరణ!

· State - Telangana · hmtvlive.com

Shorts Rajahmundry: కనుమరుగవుతున్న ప్రాచీన కళా రూపాలను కాపాడుకుంటూ కళలకు పునర్జీవం కళాకారులకు పట్టాభిషేకం రాజమహేంద్రవరంలో డాక్టర్ చల్లగాలి శ్రీనివాస్ వర్మ నిర్వహించడం అభినందనీయమని స్పెషల్ కమాండింగ్ ఎస్పీ కళా రత్న డాక్టర్ కొండా నరసింహారావు అన్నారు డాక్టర్ చల్లగాలి శ్రీనివాస్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహారావు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై శంఖా రావం పూరించారు సందర్భంగా ఎస్ పి కళా రత్న డాక్టర్ కొండా నరసింహారావు మాట్లాడుతూ గత 18 నెలలుగా ఇంద్రజాలికులు శ్రీనివాస్ వర్మ సొంత ఖర్చులతో కళాకారులను సత్కరిస్తూ కార్యక్రమాలు కొనసాగించడం శ్లాఘనీయమన్నారు శోభిత్ వర్మ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు అనంతరం రాష్ట్రపతి అవార్డు గ్రహీత సంబెళ్ళ శాంతాబాయి మాట్లాడుతూ సేవా దృక్పథంతో కళాకారుల ప్రతిభకు పట్టం కట్టడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో జరిగే శుభ కార్యక్రమాల్లో స్థానిక కళాకారులకు ప్రదర్శనలు చేసే అవకాశాలు కల్పించి ఆర్థికంగా ప్రోత్సహించాలని గొట్టాకుల శిరీష రాణి పిలుపునిచ్చారు అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న డ్రిల్‌మన్ క్రాంతి కాకమాను శ్రీనివాసరావు మాకుల రజిత బీట్‌బాక్స్ ఉపేంద్ర సాయి మాధవి, లత, సత్యనారాయణ కాగితాల కృష్ణలకు ‘శోభయమాన’ సత్కారాలు ప్రశంసా పత్రాలు అందజేశారు కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు నరేష్ తోట సుబ్బారావు దేశిరెడ్డి బలరామ నాయుడు భగీరథరాజు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News