Kaizer News

Mahabubnagar: ఛత్రపతి శివాజీ గణేష్ మండపంలో మాజీ సర

Mahabubnagar: ఛత్రపతి శివాజీ గణేష్ మండపంలో మాజీ సర్పంచ్ స్వప్న పూజలు!

· State - Telangana · hmtvlive.com

Shorts Mahabubnagar: కౌకుంట్ల మండల కేంద్రంలోని యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ గణేష్‌ మండపంలో ప్రతిష్ఠించిన గణనాథునికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం కౌకుంట్ల మాజీ సర్పంచ్‌ స్వప్న కిషన్‌రావు దంపతులు గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి, విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందారు. తదనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కౌకుంట్ల సర్పంచ్‌ నరేష్‌కుమార్‌, ఎంపీడీవో శివప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి బుచ్చన్న, ఈవో శివకుమార్, ఆంజనేయులు, రాజు, చత్రపతి శివాజీ గణేష్ యువజన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. మండపం పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి

Original source: hmtvlive.com
Read more on Kaizer News