ఇంగ్లాండ్‌లోని టెల్ఫోర్డ్‌లో భారత సంతతికి చెందిన సిక్కు బస్సు డ్రైవర్‌పై యెమెన్ దేశస్థుడు దాడి చేశాడు. దాడి చేయడమే కాదు.. బస్సును కూడా దొంగిలించాడు. ఆ బస్సును రాంగ్ రూట్‌లో నడుపుతూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అవ్వగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ దగ్గరకు వెళ్లిన నిందితుడు.. ఆయన గడ్డం పట్టుకుని లాగాడు. గొడవ వద్దని చెబుతున్నా ఆ వ్యక్తి వినలేదు. తన తలను డ్రైవర్ తలతో ఢీకొట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ దాడి ఘటనను ఓ మహిళ వీడియో తీసింది. అసలు ఏం చేస్తున్నావంటూ అంటూ దుండగుడిని ఆ మహిళ ప్రశ్నిచింది. డ్రైవర్‌పై దాడి చేయొద్దంటూ ఆమె చెబుతున్నా దుండగుడు పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డాడు. దీంతో డ్రైవర్.. పోలీసులకు ఫోన్ చేయాలని ఆ మహిళను కోరాడు. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు బస్సులోని వస్తువులను కూడా ధ్వంసం చేశాడు. డ్రైవర్ క్యాబిన్‌లోని లైట్‌లా కనిపించే ఒక వస్తువును తీసి.. దాంతో సిక్కు డ్రైవర్‌పై దాడి చేస్తానని బెదిరించాడు. బస్సును తనకు ఇవ్వాలని డ్రైవర్‌ను పదేపదే కోరాడు. చివరకు డ్రైవర్‌ను బస్సు నుంచి బయటకు తోసి.. తానే డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. బస్సు నడుపుకుంటూ వెళ్లాడు. ఆ బస్సును రాంగ్‌రూట్‌లో నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. వీడియోలో ఓ మహిళ భయంతో ఏడుస్తూ.. ప్రజలను పక్కకు తప్పుకోవాలని పదేపదే కోరుతూ.. ‘ఓ మై గాడ్’ అంటూ అరుస్తున్నట్లు వినిపిస్తుంది. ఘటన జరుగుతున్న సమయంలో ఆమె బస్సు వెనుక పరుగెత్తుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకుని దుండగుడిని అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: బ్రిడ్జిపై నుంచి పడిన బీఎండబ్ల్యూ కారు కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్