Kaizer News

అమిత్‌ షాకు అస్వస్థత.. హోటల్‌లోనే చికిత్స!

అమిత్‌ షాకు అస్వస్థత.. హోటల్‌లోనే చికిత్స!

· National - India · sakshi.com

బెంగళూరు: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అస్వస్థకు గురయ్యారు. ఈ రోజు ( శనివారం) ఉదయం ఆయన అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయారు. అమిత్‌షా రాక కోసం ప్రజలంతా ఎదురుచూస్తుండగా ఆయన అస్వస్థకు గురయ్యారని కార్యక్రమానికి హాజరుకాలేరని ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రకటించారు. కర్ణాటక హుబ్లీలో కేఎల్‌ఈ ఆసుపత్రి, మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ని ఈ రోజు శనివారం అమిత్‌షా ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కర్ణాటకాకు అమిత్‌షా చేరుకుని హోటలలో బస చేశారు. అయితే ఈ రోజు 11 గంటలకు ఆసుపత్రి ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. దీంతో ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో పాటు కళాశాల సిబ్బంది ఆయన రాక కోసం వేచి చూశారు. ఈ నేపథ్యంతో ఆయన అస్వస్థకు గురయ్యారని ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాలేరని ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రకటించారు. అస్వస్థతకు గురై హోటల్‌లోనే వైద్యుల వద్ద చికిత్స పొందుతున్నాడని వర్గాలు తెలిపాయి. అమిత్‌షా అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, ఎంపీలు బసవరాజ్ బొమ్మై, ఇరన్న కడాడి, మాజీ మంత్రి మురుగేశ్ నిరానీ, ఎమ్మెల్యేలు సీసీ పాటిల్ తదితరులు ఆయనను పరామర్శించారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News