Kaizer News

Tadepalli: మెగా డీఎస్సీ కాదు.. మెగా స్కామ్ నారా లో

Tadepalli: మెగా డీఎస్సీ కాదు.. మెగా స్కామ్ నారా లోకేష్‌పై వైఎస్‌ఆర్‌సీపీ సవాల్!

· State - Telangana · hmtvlive.com

Tadepalli: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలకు ప్రభుత్వ రికార్డులే సాక్ష్యాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వీర శేఖర్‌రెడ్డి తేల్చి చెప్పారు. టెట్‌ అర్హత నిబంధనలను పక్కనపెట్టి, అర్హత మార్కులు సాధించని వారికీ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో అర్హత లేనివారికీ టీచర్‌ ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారో ఆధారాలతో సహా ఆయన వెల్లడించారు. స్పోర్ట్స్‌ కోటాలో పరీక్ష లేకుండానే 382 పోస్టుల భర్తీ నుంచి జిల్లాల వారీగా వెలుగు చూసిన పలు కేసుల వరకు వివరించారు. తాడేపల్లి వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని, పదే పదే చర్చకు సవాల్‌ చేస్తున్న నారా లోకేష్‌కు« ధైర్యం ఉంటే సమయం, తేదీ, వేదిక ఖరారు చేయాలని.. తానైనా లేక తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులైనా చర్చకు వస్తారని సవాల్‌ చేశారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిగితే నారా లోకేష్‌ జైలుకు వెళ్లక తప్పదని తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో వీర శేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: టీచర్‌ ఉద్యోగానికి టెట్‌ తప్పనిసరి. డీఎస్సీ నోటిఫికేషన్‌లోనే ఓసీకి 90, బీసీకి 75, ఎస్సీ, ఎస్టీలకు 60 మార్కులు రావాలని స్పష్టంగా ఉంది. కానీ అదే నిబంధనలను పక్కనపెట్టి టెట్‌ అర్హత లేని వారికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? నారా లోకేష్‌ దీనికి సమాధానం చెప్పాలి. స్పోర్ట్స్‌ కోటా పేరుతో జీవోలను మార్చి 382 పోస్టులను పరీక్ష లేకుండానే భర్తీ చేశారు. చదువు చెప్పాల్సిన టీచర్లకు పరీక్ష అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, లెక్కలు, సైన్స్, సోషల్‌ వంటి సబ్జెక్టులు బోధించే వారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?. – చిత్తూరు జిల్లాలో సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఓసీ అభ్యర్థికి టెట్‌లో 90 మార్కులు రావాలి. కానీ ఆ అభ్యర్థికి 79 మార్కులు మాత్రమే వచ్చాయి. నిబంధనల ప్రకారం అర్హత లేని అభ్యర్థికి స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఎలా ఇచ్చారు? నారా లోకేష్‌ దీనికి సమాధానం చెప్పాలి. – కర్నూలు జిల్లాలో ఎస్‌జీటీ పోస్టుకు బీసీ అభ్యర్థికి టెట్‌లో 75 మార్కులు రావాలి. కానీ 65 మార్కులే వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఎలా ఇచ్చారు? టెట్‌ క్వాలిఫై కాకపోతే టీచర్‌ ఉద్యోగానికి ఎలా అర్హత వచ్చింది?’’ – అదే కర్నూలు జిల్లాకు చెందిన మరో మహిళా అభ్యర్థి మ్యాథమ్యాటిక్స్, సైన్స్‌ విభాగంలో టెట్‌ రాశారు. ఆ విభాగంలో అర్హత సాధించారు. కానీ నిబంధనలకు అనుగుణంగా కాకుండా వేరే సబ్జెక్టుకు ఉద్యోగం ఇచ్చినట్లు వివరాలు ఉన్నాయి. ఏ సబ్జెక్టులో అర్హత ఉంటే అదే సబ్జెక్టుకు పోస్టు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఈ మార్పులు ఎలా జరిగాయి?. – కృష్ణా జిల్లాలో స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ ఉద్యోగం పొందిన ఒక అభ్యర్థికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే డీఎస్సీ ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌లో పేరు ఉంది. కానీ అభ్యర్థి సర్టిఫికెట్లు, సెల్ఫ్‌ డిక్లరేషన్, టెట్‌ వివరాలు కనిపించడం లేదు. స్పోర్ట్స్‌ కోటాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన 160 మంది జాబితాలో కూడా ఆ అభ్యర్థి పేరు లేదు. మరి ఉద్యోగం ఎలా వచ్చింది?. – కడప జిల్లాలో ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌

Original source: hmtvlive.com
Read more on Kaizer News