లింగంపేట : గిరిజనుల సంప్రదాయాలకు, సంస్కృతి ఆచార వ్యవహారాలకు ప్రతీకగా తీజ్ వేడుకలు నిలు స్తాయని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. ఆదివారం లింగంపేట మండల కేంద్రంలోని సేవాలాల్ మందిరం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పూర్వికుల నుంచి వస్తున్న ఆచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా మహిళలు, యువకులు సంప్రదాయ దుస్తులు ధరించి అందరికి ఆకర్షణగా నిలిచారు. పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండలంలోని తండాల్లో తీజ్ వేడుకలు నిర్వహించారు. యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి గోధుమ నారు నెత్తిన పెట్టుకొని తండాల్లో, గ్రామాల్లో ర్యాలీలు తీశారు. అనంతరం సేవాలాల్, జగదాంబ మాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పిల్లా పాపలు, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. టీఆర్‌ఎస్ ఎల్లారెడ్డి నియోజక వర్గ ఇన్‌చార్జి, మాజీ గ్రంథాలయ చైర్మన్ సంపత్‌గౌడ్ తీజ్ వేడుకల్లో పాల్గొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లారెడ్డి: పట్టణంలో తీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బంజారా భవన్ నుంచి రామాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షడు నీలం చిన్న రాజులు, మాజీ ఎంపీ బీబీపాటిల్ పాల్గొన్నారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు