Kaizer News

రిక్షా పుల్లర్‌తో ఎమ్మెల్యే మాటామంతి

రిక్షా పుల్లర్‌తో ఎమ్మెల్యే మాటామంతి

· State - Telangana · prabhanews.com

వృద్ధుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ నర్సాపురం, ఆంధ్రప్రభ : ‘ఇంటింటికీ మీ నాయకర్‌’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నర్సాపురం పట్టణంలోని 10, 11వ వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్‌, శాసనసభ్యుడు బొమ్మిడి నాయకర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎదురుపడిన వృద్ధులు, వికలాంగులు, చేతివృత్తిదారులు, రిక్షా పుల్లర్లతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాప్యంలోనూ రిక్షా తొక్కుతున్న ఓ వృద్ధుడితో ఎమ్మెల్యే కొద్దిసేపు ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, పింఛన్‌ వస్తుందా అని అడిగి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకున్నారు. దీంతో రిక్షా పుల్లర్‌ తన అనుభవాలను ఎమ్మెల్యేతో పంచుకున్నారు. ఎమ్మెల్యే, రిక్షా పుల్లర్‌ మధ్య జరిగిన సంభాషణలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. వృద్ధులు, వికలాంగుల పట్ల ఎమ్మెల్యే చూపుతున్న ఆదరణను నాయకులు కొనియాడారు. ప్రజల ముంగిటకే నేరుగా వెళ్లి వారి జీవన పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు వార్డుల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకే ‘ఇంటింటికీ మీ నాయకర్‌’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే నాయకర్‌ తెలిపారు. పాలనలో అలసత్వానికి తావులేకుండా సామాన్యుల కష్టాలను తెలుసుకుని, పెండింగ్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట రామిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News