Kaizer News

30 మంది లబ్ధిదారులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు

30 మంది లబ్ధిదారులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు

· State - Telangana · prabhanews.com

కార్మికులకు పలు ప్రయోజనాలు: సర్పంచ్ రాజిరెడ్డి టేకుమట్ల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 30 మంది లబ్ధిదారులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను గ్రామ సర్పంచ్ కుర వెంకట రాజిరెడ్డి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజిరెడ్డి, శ్రీపతి రాకేష్ మాట్లాడుతూ లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వివాహ కానుక, మాతృ ప్రయోజనం, ప్రమాద సహాయం, వైకల్య సహాయ పరికరాలు, సహజ మరణం సంభవించినప్పుడు అంత్యక్రియల ఖర్చులు, నైపుణ్య శిక్షణ, అభివృద్ధి శిక్షణతోపాటు ఆర్థిక, ఆరోగ్య భద్రత వంటి ప్రయోజనాలు లభిస్తాయని వివరించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన భవన నిర్మాణ కార్మికులు, ఇతర రంగాలకు చెందిన 18 నుంచి 59 ఏళ్ల వయస్సు వారు లేబర్ ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News