రైతు సంక్షేమాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక విశేషమైన పథకాలను అమలు చేస్తోంది. వీటిలో కొన్ని పథకాలు రైతులకు నేరుగా ఆర్థిక సాయాన్ని అందిస్తుంటే, మరికొన్ని పథకాలు వృద్ధాప్యంలో పెన్షన్ ఆసరాను, అలాగే సాగు ఖర్చుల కోసం అత్యంత సులభంగా తక్కువ వడ్డీకే రుణ సదుపాయాన్ని చేకూరుస్తున్నాయి. అయితే, సరైన సమాచారం లేకపోవడం వల్ల ఇప్పటికీ ఎంతోమంది అర్హులైన రైతులు ఈ ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. మీరు కూడా వ్యవసాయం చేస్తున్నట్లయితే, మీకు ఎంతగానో ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వానికి చెందిన మూడు అద్భుతమైన పథకాల వివరాలు తప్పక తెలుసుకోవాలి. అవే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC)