Kaizer News

Prakasam: చరిత్ర సృష్టించాలన్నా తిరగరాయాలన్నా చంద్

Prakasam: చరిత్ర సృష్టించాలన్నా తిరగరాయాలన్నా చంద్రబాబుకే సాధ్యం: మంత్రి గొట్టిపాటి!

· Entertainment · hmtvlive.com

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో చరిత్ర సృష్టించాలన్నా.. గత చరిత్రను తిరగరాయాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సాధ్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. మూడు దశాబ్దాలుగా మార్కాపురం ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం అవుతోందని తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనుందని చెప్పారు. ఈ ప్రారంభోత్సవం ప్రకాశం జిల్లా ప్రజలకు, ముఖ్యంగా మార్కాపురం ప్రాంతానికి చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడంతో పాటు హార్టికల్చర్‌ హబ్‌లో చేర్చడం, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించే స్థాయికి తీసుకురావడం చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమైందని మంత్రి తెలిపారు. వెలిగొండ పూర్తవడంతో కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని అన్నారు. నీటి లభ్యత పెరగడంతో వ్యవసాయం, ఉద్యాన పంటలు, ఉపాధి అవకాశాలు విస్తరించి ఈ ప్రాంత ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వస్తాయని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుకు నికర జలాలు సాధించేందుకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చామని గొట్టిపాటి రవికుమార్‌ గుర్తుచేశారు. ప్రాంతీయ ప్రజల ప్రయోజనాల కోసం అప్పట్లో చేసిన పోరాటం ఫలించిందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం ప్రజలు, నాయకులు, రైతులు ఎన్నో సంవత్సరాలుగా చేసిన పోరాటానికి ఇప్పుడు ఫలితం దక్కుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను సైతం పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వ కాలంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు దెబ్బతిన్నాయని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యం వహించిన వైసీపీ నేతలకు వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. కొండలను బద్దలు కొట్టి కరువు ప్రాంతాలకు నీటిని తీసుకువచ్చిన చరిత్ర చంద్రబాబుదేనని మంత్రి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తవడంతో మార్కాపురం ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు వ్యవసాయ రంగం రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. సాగునీటి సౌకర్యం అందుబాటులోకి రావడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లే అవకాశం ఉంటుందని, ఉద్యానవన రంగం కూడా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వెలిగొండ నిర్వాసితులకు కేవలం 48 రోజుల్లో రూ.768 కోట్ల పరిహారం అందించడం రికార్డుగా నిలిచిందని గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందన్నారు. ప్రాజెక్టు ప్రారంభంతో ప్రకాశం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు నీటి భద్రత పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం అవుతున్న వేళ.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవం చరిత్రలో న

Original source: hmtvlive.com
Read more on Kaizer News