Kaizer News

అవినీతి సొమ్ముకు పసిడి ముసుగు! షేర్లు, భూములు కొంట

అవినీతి సొమ్ముకు పసిడి ముసుగు! షేర్లు, భూములు కొంటలేరు.. బంగారం, వెండి బిస్కెట్లుగా దాస్తుండ్రు

· Entertainment · v6velugu.com

హైదరాబాద్​, వెలుగు: అవినీతి అధికారులు రూటు మార్చారు. తమ అక్రమ సంపాదనను ఒకప్పుడు బ్యాంకు లాకర్లలో, షేర్లు, ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్​ డిపాజిట్లలో, ఇండ్లు, ప్లాట్లు, రియల్​ఎస్టేట్​ పెట్టుబడుల రూపంలో దాచుకునేవారు. కానీ తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ చేపడ్తున్న వరుస సోదాలతో మరో కొత్త విషయం వెలుగుచూసింది. నగదు, ఆస్తి పత్రాలతోపాటు కిలోల కొద్దీ బంగారం బయటపడుతుండడంపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. అవినీతి సొమ్ము నగదు, భూముల రూపంలో కన్నా బంగారంగా మార్చి దాచుకోవడమే సురక్షితమని అధికారులు భావిస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఏసీబీ సోదాల్లో పట్టుబడిన బంగారాన్ని తమకు వారసత్వంగా వస్తున్నదనో, పెళ్లి సమయంలో కట్న కానుకల రూపంలో ఇచ్చిందనో లెక్కలు చూపి తప్పించుకుంటున్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగిపోయింది. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం కాళేశ్వరం లాంటి ఇరిగేషన్​ ప్రాజెక్టులతోపాటు మిషన్​భగీరథ, మిషన్​కాకతీయ, రోడ్లు, ఇతరత్రా మౌలికవసతుల ప్రాజెక్టులు చేపట్టడం.. నగరాలు, పట్టణాలు విస్తరణతో రియల్​ఎస్టేట్​జోరందుకోవడం ఇందుకు కారణమయ్యాయి. ఈ క్రమంలో ఇరిగేషన్​, రెవెన్యూ, మున్సిపల్​, రిజిస్ట్రేషన్‌‌, ట్రాన్స్‌‌పోర్ట్‌‌, పోలీస్​తదితర శాఖల్లో పలువురు కీలకమైన అధికారుల ఆస్తులు వందల కోట్లకు పెరిగిపోయాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం ఆదేశాల మేరకు ఇలాంటి అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఏసీబీ కేసుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. 2020లో ఏసీబీ దాడులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 84 నమోదైతే 2024లో ఈ సంఖ్య 152కు, 2025లో 199కి పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్​ వరకు 55 కేసులు నమోదయ్యాయి. ఇటీవలి ఏసీబీ దాడుల్లో అవినీతి అధికారుల వద్ద కిలోల కొద్దీ పసిడి బయటపడుతున్నది. ఒక మధ్యతరగతి కుటుంబం 10 గ్రాముల బంగారం కొనాలంటే ఎన్నో లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాలు, బ్యాంక్ లాకర్లలో ఏసీబీ తనిఖీలు చేసినప్పుడు పెద్దమొత్తంలో బంగారం దొరుకుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. కొందరి వద్ద ఆభరణాల రూపంలో దొరుకుతుండగా, మరికొందరి వద్ద ఏకంగా బంగారు, వెండి బిస్కెట్ల రూపంలో లభిస్తుండడం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ చేపట్టిన తనిఖీలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో వెలుగులోకి వస్తున్న గణాంకాలు విస్తుపోయేలా ఉన్నాయి. ఇప్పటివరకు వివిధ సోదాల్లో ప్రభుత్వ అధికారుల నుంచి సుమారు 90 కిలోల పసిడి, 150 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ రికార్డులు చెప్తున్నాయి. ఆర్ అండ్ బీ ఇంజనీర్ -ఇన్ -చీఫ్ బి మోహన్ నాయక్‌‌కు బిస్కెట్ల రూపంలో బంగారం దాచుకునే అలవాటు ఉన్నట్టు అధికారుల విచారణలో తేలింది. ఈయన దగ్గర 2.5 కిలోల బంగారం బిస్కెట్ల రూపంలో దొరకడం గమనార్హం. ఇక ఇటీవల పట్టుబడ్డ శామీర్‌‌‌‌పేట తహసీల్దార్​ తుమ్మకొమ్మ సుచరిత వద్ద ఏకంగా రూ. 1.20 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాభరణాలు దొరికాయి. అవినీతి అధికారులు తమ అక్రమ సంపాదనను దాచుకోవడానికి నగదు, భూముల కంటే బంగారం వైపు మొగ్గు చూపడానికి పలు కారణాల

Original source: v6velugu.com
Read more on Kaizer News