Kaizer News

పిలాయిపల్లి కాలువలో గుర్రపుడెక్క తొలగింపు పనులు ప్

పిలాయిపల్లి కాలువలో గుర్రపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం

· State - Telangana · prabhanews.com

రూ.20 లక్షల సీఎస్ఆర్‌ నిధులతో పనులకు శ్రీకారం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : బండరావిరాల నుంచి పెద్దకాపర్తి వరకు పిలాయిపల్లి కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు పనులు శుక్రవారం బండరావిరాల వద్ద ప్రారంభమయ్యాయి. మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవతో, భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సహకారంతో ఈ పనులు చేపట్టారు. దివిస్‌ ల్యాబొరేటరీస్‌ యాజమాన్యం తమ సీఎస్ఆర్‌ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించింది. చౌటుప్పల్‌ ఇరిగేషన్‌ ఈఈ రాధాకృష్ణ, డీఈ కృష్ణారెడ్డితో కలిసి చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ పిలాయిపల్లి కాలువలో గుర్రపుడెక్క విపరీతంగా పేరుకుపోవడంతో నీరు సక్రమంగా పారక చౌటుప్పల్‌ మండల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ సమస్యను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి దివిస్‌ యాజమాన్యంతో మాట్లాడి రూ.20 లక్షల సీఎస్ఆర్‌ నిధులు మంజూరు చేయించారన్నారు. రైతుల సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి, సహకరించిన దివిస్‌ యాజమాన్యానికి ఈ ప్రాంత రైతాంగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమిడి ప్రదీప్‌జీ, పోచంపల్లి సింగిల్‌ విండో చైర్మన్‌ పాక మల్లేష్‌యాదవ్‌, జూలూరు సింగిల్‌ విండో చైర్మన్‌ కళ్లెం రాఘవరెడ్డి, వైస్‌ చైర్మన్‌ చెన్నగొని అంజయ్య, చౌటుప్పల్‌, పోచంపల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు బోయ దేవేందర్‌, ఉప్పునూతల వెంకటేష్‌యాదవ్‌, సర్పంచ్‌లు తీగుళ్ల చంద్రయ్య, కాసుల అంజయ్య, పెరుమాండ్ల మహాలక్ష్మి దానయ్య, మాజీ ఎంపీటీసీ బద్దం కొండల్‌రెడ్డి, జిల్లా నాయకులు నల్ల నరేందర్‌రెడ్డి, ఢిల్లీ శేఖర్‌రెడ్డి, చేవెళ్లి కృష్ణ, సంతు, ఫకీరు యాదిరెడ్డి, దివిస్‌ సంస్థ ప్రతినిధి గోపి పాల్గొన్నారు. చౌటుప్పల్‌, పోచంపల్లి మండలాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

Original source: prabhanews.com
Read more on Kaizer News