Kaizer News

గౌరవెల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం నా బాధ్యత.. య

గౌరవెల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం నా బాధ్యత.. యువత సెల్ఫోన్ ను పడేయండి ఆటలు ఆడండి

· State - Telangana · v6velugu.com

భీమదేవరపల్లి, వెలుగు : గౌరవెల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి నీళ్లు నింపే బాధ్యత తనదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 'పల్లె పల్లెకు పొన్నం అన్న' కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం, గొల్లపల్లి, ముస్తఫాపూర్, వీరభద్రనగర్, గట్లనర్సింగాపూర్, బొల్లోన్​పల్లి గ్రామాల్లో పర్యటించారు. ప్రజల నుంచి వినతులు తీసుకొని అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం వివిధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించేందుకే నియోజకవర్గంలోని పత్రి మహిళా సంఘానికి స్టీల్​బ్యాంక్​అందజేసినట్లు చెప్పారు. యువత సెల్​ఫోన్ ను పక్కన పడేసి ఆటలు అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లోకి ప్రైవేట్​స్కూల్ బస్సులు రాకుండా అడ్డుకొని ప్రభుత్వ పాఠశాలలను బలపేతం చేసే గ్రామాలకు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జడ్పి సీఈవో శేషాద్రి, సర్పంచ్​లు భారతి, నేతుల మోహన్, గడ్డం సుజాత, బి.అజయ్, ​కొర్ర గోపాల్, బొల్లి మానస, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి ఉన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News