Shorts Pithapuram: పిఠాపురం మున్సిపల్ ఎన్నికలలో ఛైర్‌పర్సన్ స్థానానికి పోటీలో ఉన్నట్లు జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు, అడ్వకేట్ కామిశెట్టి (సైతన) సత్యవేణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2014 నుండి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నానని, 2017 నుండి పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్నానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమైన అంశాలను వెల్లడించారు: లీగల్ సేవలు & పార్టీకి అండ: వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన తాను పార్టీకి సంబంధించిన వివిధ చట్టపరమైన, లీగల్ అంశాలలో నిరంతరం సలహాలు, సూచనలు ఇస్తూ జెనసేన పార్టీకి అండగా నిలిచానని గుర్తుచేశారు. 2019 శాసనసభ ఎన్నికల్లో విజయవాడ వెళ్లి పోటీకి ఆసక్తి చూపినప్పటికీ, పార్టీ టికెట్ మాకినీడి శేషుకుమారి కి ఇచ్చారు. శేష్ కుమారి కి టికెట్ రాగానే కొందరు నాయకులు వీడి వెళ్లినా.. తాను మాత్రం పార్టీ నిబద్ధతతో శేషుకుమారి విజయం కోసం నియోజకవర్గమంతటా విస్తృతంగా ప్రచారం చేశానని చెప్పారు. స్థానిక ఎన్నికలు & యువత చైతన్యం: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు నామినేషన్ల ప్రక్రియలో తోడ్పడుతూ, వారికి నైతిక మద్దతు (Moral Support) అందించానని తెలిపారు. అలాగే గత 5-6 సంవత్సరాలుగా సోషల్ మీడియా (ఫేస్‌బుక్) ద్వారా ఎమోషనల్ పోస్టులతో యువతను, ప్రజలను నిరంతరం చైతన్యపరుస్తున్నానని, దానికి సంబంధించిన ఆధారాలు నేటికీ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయం: హక్కులతో పాటు ప్రజలకు బాధ్యతలను గుర్తుచేస్తూ, పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఫోటోలు, ఫ్లెక్సీలు, హడావుడి పబ్లిసిటీకి దూరంగా ఉంటూ నిజాయితీగా, సహజత్వంతో ప్రజల్లో ఉండటమే తన విధానమని వివరించారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలో: "మన పిఠాపురంలో మన ప్రియతమ నాయకుడు, అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, ఆయన ఆలోచనలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయడమే నా జీవిత సంకల్పం. పవన్ కళ్యాణ్ మాట-బాటే నా బలం," అని ఆమె స్పష్టం చేశారు. పిఠాపురం పట్టణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఛైర్‌పర్సన్ బరిలో నిలుస్తున్నట్లు ఆమె ప్రకటన ద్వారా తెలియజేశారు