Kaizer News

Jagtial: కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి జీవన్ రె

Jagtial: కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిప్పులు!

· State - Telangana · hmtvlive.com

Shorts జగిత్యాల: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉన్నప్పటికీ, ప్రజలకు నీరందించే చర్యలు చేపట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డైవర్షన్‌కు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌లను వినియోగించుకోవచ్చని NDSA తెలిపినప్పటికీ, మాజీ సీఎం కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే నెపంతో కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా ప్రభుత్వం నీటిని అందించడం లేదని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులు పార్టీ ఫిరాయింపుల వెనుక ప్రధాన పాత్ర సీఎం రేవంత్ రెడ్డిదేనని, దానం నాగేందర్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు సీఎంకు చెంపపెట్టు లాంటిదని అన్నారు. అర్ధరాత్రి కండువాలు కప్పి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎంకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని, ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడే కాంగ్రెస్ అగ్రనేతలు దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. భూ వివాదాల ఆరోపణలు కేసీఆర్‌కు కేవలం 67 ఎకరాల భూమి మాత్రమే ఉంటే, ఆయనపై కుట్రపూరితంగా భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారని.. అదే సమయంలో సీఎం కుటుంబానికి వందల ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు. స్థానిక విమర్శలు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకత్వంతో నడుపుతున్న సంబంధాలపై కూడా ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News