Kaizer News

Vijay Sethupathi | విజ‌య్ కాల్ చేయగానే ఆశ్చ‌ర్య‌పో

Vijay Sethupathi | విజ‌య్ కాల్ చేయగానే ఆశ్చ‌ర్య‌పోయా.. ఆయ‌న నిరాడంబ‌రుడు : విజ‌య్ సేతుప‌తి

· State - Telangana · ntnews.com

Vijay Sethupathi : తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM), ప్రముఖ నటుడు విజయ్‌ (Actor Vijay) తో తనకున్న అనుబంధం గురించి నటుడు విజయ్ సేతుపతి (Vijay Setupati) ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విజయ్ నిరాడంబరత తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) జన్మదినం సందర్భంగా తాను శుభాకాంక్షలు తెలియజేశానని, ఆ తర్వాత ఊహించని విధంగా విజయ్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని సేతుపతి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘ప్రియ మిత్రమా’ అంటూ విజయ్ తనతో మాట్లాడారని, తన కుమారుడికి విషెస్ చెప్పినందుకు ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారని విజయ్ సేతుపతి తెలిపారు. అగ్ర నటుడైనప్పటికీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఈ స్థాయికి చేరుకున్నా విజయ్ ఎంతో నిరాడంబరంగా ఉంటారని ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో ‘జన నాయగన్’ చిత్ర సెట్స్‌లో విజయ్‌ను చూశానని, అప్పుడు ఆయన ఎంతో ఆకర్షణీయంగా కనిపించారని తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News