Kaizer News

Pithapuram: దొంతమూరులో గ్యాస్ లీక్ అగ్ని ప్రమాదం బ

Pithapuram: దొంతమూరులో గ్యాస్ లీక్ అగ్ని ప్రమాదం బాధితులను పరామర్శించిన నేతలు

· State - Telangana · hmtvlive.com

పిఠాపురం: పిఠాపురం మండలం దొంతమూరు గ్రామంలో రాజులమ్మ, వీరబాబు, లక్ష్మీ కుటుంబానికి చెందిన ఇంట్లో ఈరోజు ఉదయం గ్యాస్ లీక్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో పాటు ఇంట్లోని సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. కళ్లముందే సర్వం కోల్పోయిన బాధిత కుటుంబ పరిస్థితి అత్యంత విషాదకరం. వారి నష్టం పూడ్చలేని,ఈ ఘటనపై గౌరవ పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా నిలవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఫైవ్ మన్ కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు దొంతమూరు గ్రామానికి చేరుకుని అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం, ఆర్థిక సహాయం త్వరితగతిన అందేలా ఎమ్మార్వో ఆర్ఐలకు అధికారులతో మాట్లాడటం జరిగింది. పిఠాపురంలో ఏ సమస్య వచ్చినా.. నేనున్నాను” అనే భరోసాతో పవన్ కళ్యాణ్ ప్రజలకు అండగా నిలుస్తున్నారు అని బాధిత కుటుంబానికి మా వంతు సహాయాన్ని అందించి, వారి కష్ట సమయంలో అండగా నిలిచాం అని అన్నారు.జనసేన పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం అనే భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హరిబాబు, మాజీ సర్పంచ్ కొత్తపల్లి రమణ బాబ్జి,ఎంపీపీ కె.కామేశ్వరరావు, బాలిపల్లి రాంబాబు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News