Kaizer News

Markapuram: సచివాలయాల్లో పెన్షన్ దరఖాస్తులను పరిశీ

Markapuram: సచివాలయాల్లో పెన్షన్ దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్

· State - Telangana · hmtvlive.com

Shorts మార్కాపురం జిల్లా: ఎర్రగొండపాలెం, గురిజేపల్లి సచివాలయాలను కలెక్టర్ ఎం. విజయ సునీత సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల వివరాలు, లాగిన్‌లలో జరుగుతున్న అప్‌డేట్ ప్రక్రియను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పెన్షన్ దరఖాస్తులను ఈరోజు సాయంత్రంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బండారు శ్రీనివాసులు, తహసీల్దార్ జయలక్ష్మిని పెన్షన్ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయాల వారీగా పెండింగ్ దరఖాస్తుల పరిస్థితిపై సమీక్షించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News