Kaizer News

Jailer 2 | ‘జైలర్ 2’కి బిగ్ షాక్ .. దసరా బరిలో రజి

Jailer 2 | ‘జైలర్ 2’కి బిగ్ షాక్ .. దసరా బరిలో రజినీకాంత్ రావడం అనుమానమే,అసలు కారణం ఇదేనా?

· Entertainment · ntnews.com

Jailer 2 | సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘జైలర్ 2’ ఒకటి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొదటి భాగం సాధించిన భారీ విజయంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో.. ఇప్పుడు సీక్వెల్‌లో రజినీకాంత్ పాత్రను దర్శకుడు నెల్సన్ ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మొదటి నుంచీ చాలా పరిమితంగానే అప్‌డేట్స్ ఇస్తున్నారు. షూటింగ్, కథ, పాత్రలు, యాక్షన్ సీక్వెన్స్‌లకు సంబంధించిన వివరాలను పెద్దగా బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ‘జైలర్ 2’పై అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ‘జైలర్ 2’ను అక్టోబర్ 15న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పండుగ సీజన్ కావడంతో భారీ ఓపెనింగ్స్ సాధించేందుకు ఇది మంచి సమయంగా భావించారు. రజినీకాంత్‌కు ఉన్న క్రేజ్, ‘జైలర్’కు వచ్చిన రెస్పాన్స్, నెల్సన్ దిలీప్‌కుమార్‌పై ఉన్న అంచనాలు కలిస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటివరకు సినిమా అనుకున్న సమయానికి విడుదల చేయడంలో ఎలాంటి రాజీ లేదనే టాక్ వినిపించింది. కానీ తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 15న ‘జైలర్ 2’ విడుదల కావడం అనుమానమేననే ప్రచారం మొదలైంది. సినిమా నిర్మాణ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, భారీ స్థాయిలో తెరకెక్కుతున్న యాక్షన్ సన్నివేశాలు వంటి అంశాల కారణంగా అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయడం కష్టమవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిని కేవలం ప్రచారంగా మాత్రమే చూడాల్సి ఉంటుంది. ‘జైలర్ 2’పై రజినీకాంత్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగంలో ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజినీకాంత్ చూపించిన స్టైల్, యాక్షన్, డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సీక్వెల్‌లో ఆయన పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతారని అభిమానులు ఆశిస్తున్నారు.ఇలాంటి సమయంలో రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందనే వార్తలు రావడంతో ఫ్యాన్స్‌లో కొంత ఆందోళన మొదలైంది

Original source: ntnews.com
Read more on Kaizer News