Kaizer News

Razole: మృతి చెందిన జనసైనికుల కుటుంబాలను పరామర్శిం

Razole: మృతి చెందిన జనసైనికుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

· State - Telangana · hmtvlive.com

రాజోలు: ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు జనసైనికుల కుటుంబాలను రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ నేడు పరామర్శించారు. మృతుల స్వగ్రామాలకు వెళ్లిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి ధైర్యం చెప్పారు. ఈ ప్రమాదంలో సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామానికి చెందిన పోతుల లక్ష్మీ భాను, మోరి గ్రామానికి చెందిన నాగిరెడ్డి దుష్యంత్ సాయి, శృంగవర్పాడు గ్రామానికి చెందిన చెరుకూరి రాజారాం మృతి చెందారు. ముగ్గురు జనసైనికుల అకాల మరణం పార్టీకి, వారి కుటుంబాలకు తీరని లోటని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. తమను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు మృతుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News