ఎండ, కాలుష్యం, దుమ్ము కారణంగా చాలా మంది ముఖం నల్లగా మారిపోతుంది. దీన్ని దూరం చేసి ముఖాన్ని కాంతివంతంగా మార్చే ఒక చిట్కా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే పసుపు ఐస్ క్యూబ్స్.. భారతీయ సంప్రదాయ సౌందర్య పోషణలో పసుపుకు ఉన్న ప్రాముఖ్యత మనకు తెలిసిందే.. అయితే దానికి ఐస్ చల్లదనం తోడైతే ముఖానికి తాత్కాలిక తాజాదనం, సహజమైన గ్లో వస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరీ దీన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం