Kaizer News

వెలుగు స్పెషల్: సామాన్యుడి జేబుపై యూపీఐ భారం!

వెలుగు స్పెషల్: సామాన్యుడి జేబుపై యూపీఐ భారం!

· State - Telangana · v6velugu.com

నా చిన్ననాటి వయసులో మా పెద్దవాళ్లు చెప్పిన మాటలు ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చక్కగా అన్వయించవచ్చు. బ్రిటిష్ కాలంలో భారతదేశంలో టీ రుచి ప్రజలకు పరిచయం చేయడానికి దాన్ని రైల్వేస్టేషన్లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా అందించేవారు. మొదట ఉచితంగా పరిచయమైనది.. క్రమంగా అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు టీ లేదా కాఫీ లేకుండా రోజు ప్రారంభించడం కష్టంగా మారింది. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా తొలుత డిజిటల్ లావాదేవీలు అంటూ యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించి ఇప్పుడు వాటిపై చార్జీలు విధిస్తూ సాధారణ ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమైంది. నగదు రహితంగా, వేగవంతంగా, సులభ తరహాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ విస్తృతంగా విస్తరించిన యూపీఐ లావాదేవీలపై నిత్యం కోట్లాది మంది ఆధారపడుతున్న సమయంలో ఈ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం అదనపు వ్యయం చార్జీలు మోపడంతో అది వినియోగదారులపై కొత్త ఆర్థిక భారానికి దారితీయడం ఖాయం. యూపీఐ విశ్వవ్యాప్తంగా భారత సామర్థ్యానికి గుర్తింపుగా నిలిచాయని, రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే ముందంజలో ఉందని ఇదంతా తమ విజయమని నిత్యం గొప్పలు చెప్పుకునే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పరోక్షంగా ప్రజలపై భారం వేయడానికి సిద్ధమైంది. యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించే అంశం చర్చకు వచ్చినప్పుడు ఇలాంటి ప్రతిపాదనలేమీ లేవని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ 2025 జూన్ 11న స్పష్టత ఇచ్చి, ఇప్పుడు భారం మోపుతోంది. తాజాగా ఎన్పీసీఐ ప్రకటించిన కొత్త విధానం ప్రకారం అక్టోబర్ 15, 2026 నుంచి అర్హత కలిగిన వ్యాపారులకు రూ.2,000కు మించిన యూపీఐ పర్సన్- టు -మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలులోకి రానుంది. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 పరిమితి విధించడంతోపాటు కొన్ని ప్రత్యేక రంగాలకు వేరే ఫీజు నిర్మాణం ఉంటుందని ప్రకటించారు. లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘వినియోగదారుడిపై నేరుగా చార్జీ లేదు’ అన్న ప్రభుత్వ వాదనకు, ‘భవిష్యత్తులో పరోక్ష భారం పడే అవకాశం ఉంది’ అన్న ఆందోళనకు మధ్య తేడా కనిపిస్తుంది. చెల్లింపు సమయంలో వినియోగదారుడి యూపీఐ యాప్‌‌‌‌లో అదనపు రూ.40 చార్జీ కనిపించకపోవచ్చు. కానీ అదే రూ.40ను వ్యాపారి వస్తువు ధరలో కలిపితే, సేవా రుసుములో సర్దుబాటు చేస్తే, యూపీఐకి బదులుగా నగదు చెల్లించాలని కోరితే, అప్పుడు భారం చెల్లింపు నేరుగా కనిపించకపోయినా, వినియోగదారుడి మొత్తం ఖర్చులో ప్రతిబింబించడం ఖాయం. ఇప్పుడు ఈ చార్జీల భారాన్ని బ్యాంకులు, పేమెంట్ యాప్‌‌‌‌లు, పెద్ద వ్యాపార సంస్థలు తీసుకుంటాయా? లేదా చివరికి వస్తువులు, సేవల ధరల రూపంలో సామాన్య వినియోగదారుడే భరించాల్సి వస్తుందా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం అవసరం. ఒకప్పుడు ‘డిజిటల్ ఇండియా’కు ప్రతీకగా, ప్రపంచానికి భారత్ చూపించిన డిజిటల్ న‌‌‌‌మూనాగా యూపీఐని గర్వంగా ప్రస్తావించిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు అందులోనే చార్జీలు విధించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం. రూ.2000 లా

Original source: v6velugu.com
Read more on Kaizer News