ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు వర్షాభావం, తాగునీటి కొరత, రహదారుల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న రాయలసీమలో గ్రామీణ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల పరిధిలో చేపట్టిన పలు కార్యక్రమాలతో సీమ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గత రెండేళ్లలో గ్రామాలు, అటవీ ప్రాంతాల అభివృద్ధికి కలిపి రూ.8,022 కోట్లకు పైగా విలువైన పనులు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాయలసీమలో వర్షపు నీటిని ఒడిసిపట్టడంతో పాటు భూగర్భ జలాలను పెంచేలా పంట కుంటలు, ఇంకుడు గుంతలు, ఇతర నీటి సంరక్షణ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఫారం పాండ్ల నిర్మాణంలో భాగంగా రెండు దశల్లో పెద్ద సంఖ్యలో కుంటలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో ఎనిమిది జిల్లాల్లో 40,837 పంట కుంటలు నిర్మించాలనే లక్ష్యాన్ని అధిగమించి 41,614 కుంటలను పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.166.46 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. రెండో దశలో మరో 29,902 ఫారం పాండ్లు మంజూరై వివిధ దశల్లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నీటి సంరక్షణ పనుల కారణంగా రాయలసీమలో 50 వేల ఎకరాలకు పైగా అదనపు సాగు విస్తీర్ణం అందుబాటులోకి వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. రైతులకు సుమారు రూ.55 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరినట్లు పేర్కొంది. రాయలసీమను ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉపాధి హామీ పథకం నిధులను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పండ్ల తోటలు, పూలు, మునగ తదితర పంటల సాగుకు రైతులకు సహకారం అందిస్తున్నారు. రెండు దశల్లో సుమారు 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు చేపట్టేందుకు రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా 28 వేల మందికి పైగా రైతులు ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు. ఎకరాకు సంవత్సరానికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. పశుపోషణపై ఆధారపడే రైతులకు మౌలిక వసతులు కల్పించేందుకు మినీ గోకులాల నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రెండేళ్లలో రాయలసీమలో సుమారు 15 వేల వ్యక్తిగత పశువుల షెడ్లు నిర్మించగా.. మరో 3 వేల నిర్మాణాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మొదటి దశలోనే 9,708 మినీ గోకులాలు పూర్తయ్యాయని, పల్లెపండుగ, పల్లెపండుగ 2.0 కార్యక్రమాల ద్వారా వీటి నిర్మాణానికి రూ.170 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మానవ–ఏనుగుల ఘర్షణలను తగ్గించేందుకు కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీ ఏనుగులకు పలమనేరు నియోజకవర్గంలోని ముసలమడుగులో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ తెలిపింది. ఈ శిబిరం నుంచి కుంకీ ఏనుగులతో సుమారు 15 ఆపరేషన్లు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి రాకతో మానవ–ఏనుగుల ఘర్షణలు సుమారు 75 శాతం , పంట నష్టం 50 శాతం తగ్గినట్లు ప్రభుత్వం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచే ఉద్దేశంతో నగర వనాలను అభివృద్ధి చేస్తున్నట్లు అటవీశాఖ వెల్లడించింది. రాయలసీమలో ఇప్