Shorts Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలు భక్తులతో సందడిగా మారుతున్నాయి. ఈ క్రమంలో సామాజికవేత్త డాక్టర్ మదిరాజ్ సాయి భూపాలపల్లి పట్టణం లోని జవహర్ నగర్ కాలనీ,t2 క్వాటర్స్ తో పాటు పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండప నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంతో పాటు ఇక్కడి ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తన వంతు సహకారం అందిస్తానని డాక్టర్ మదిరాజ్ సాయి రతన్ తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు