Kaizer News

Penamaluru: జనవరి 15 నాటికి టిడ్కో ఇళ్ల తాళాలు అంద

Penamaluru: జనవరి 15 నాటికి టిడ్కో ఇళ్ల తాళాలు అందజేస్తాం: ఎమ్మెల్యే బోడే!

· State - Telangana · hmtvlive.com

పెనమలూరు: జగన్ పాలనలో పేదవాడి ఇల్లు ఆగిపోయింది కూటమి పాలనలో సొంతింటి తాళం చేతికి వస్తోంది వాళ్లు వదిలేసిన పనులను మేము పూర్తి చేస్తున్నాం వాళ్లు ఆపిన అభివృద్ధిని మేము పరుగులు పెట్టిస్తున్నాం ఇది మాటల ప్రభుత్వం కాదు పనులతో సమాధానం చెప్పే ప్రభుత్వం ఉయ్యూరు మండలం ఉయ్యూరు పట్టణంలోని టిడ్కో స్వగృహ సందర్శన యాత్ర కార్యక్రమంలో లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ గారు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ...ఏళ్ల తరబడి పేద కుటుంబాలు ఎదురుచూసిన టిడ్కో ఇళ్లకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని అన్నారు. పేదవాడికి ఇల్లు ఇవ్వడం అంటే కేవలం నాలుగు గోడలు కట్టడం కాదని. ఆ ఇంటితో పాటు గౌరవంగా,ఆరోగ్యంగా,సురక్షితంగా జీవించే వాతావరణాన్ని కల్పించడమే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమని తెలిపారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం టిడ్కో గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి,పేద కుటుంబాలకు ఇళ్లతో పాటు రోడ్లు,డ్రైనేజీ, తాగునీరు,పార్కులు,పాఠశాలలు వంటి మౌలిక వసతులతో సమగ్ర నివాస సముదాయాలను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలపై నిర్లక్ష్య వైఖరి అవలంబించిందని ఎమ్మెల్యే గారు విమర్శించారు. ప్రభుత్వాలు మారవచ్చు. కానీ పేదవాడి సొంతింటి కల ఎందుకు మారాలి? పేదవాడికి ఇల్లు పూర్తి చేయాల్సిన ప్రభుత్వం...ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టకుండా రంగులు మార్చడానికే పరిమితమైంది అని ఎద్దేవా చేశారు. ఇళ్లు పూర్తి చేయలేని వారు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏళ్లుగా నిలిచిపోయిన టిడ్కో గృహాల పనులను తిరిగి ప్రారంభించి వేగవంతం చేశామని తెలిపారు. నవంబర్,డిసెంబర్ నెలల్లో నిర్మాణ పనులను పూర్తి చేసి,జనవరి 15లోగా ప్రతి లబ్ధిదారుడి చేతికి సొంతింటి తాళం అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు స్పష్టం చేశారు. టిడ్కో గృహాల వద్ద సుమారు రూ.13 కోట్లతో సమగ్ర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు,పార్కులు,రోడ్లు, కమ్యూనిటీ హాల్,హాస్పిటల్,స్కూల్, అంగన్వాడీ,సూపర్ మార్కెట్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో పేదవాడికి మిగిలింది ఎదురుచూపులే. కూటమి పాలనలో పేదవాడి చేతికి సొంతింటి తాళం వస్తోంది,వాళ్లు ఆపిన పనులను మేము పూర్తి చేస్తున్నాం...వాళ్లు వదిలేసిన అభివృద్ధిని మేము పరుగులు పెట్టిస్తున్నాం,ఇదే కూటమి ప్రభుత్వానికి,గత వైసీపీ పాలనకు ఉన్న తేడా,ఇది మాటల ప్రభుత్వం కాదు. పనులతో సమాధానం చెప్పే ప్రభుత్వం అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,అధికారులు,టిడ్కో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News