Kaizer News

నాలుగేళ్లకే షుగరొచ్చినా ఇప్పుడాయన ఛాంపియన్‌..!

నాలుగేళ్లకే షుగరొచ్చినా ఇప్పుడాయన ఛాంపియన్‌..!

· State - Telangana · sakshi.com

మూడు నెలల కిందట ఇదే ఏడాది 2026 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫ్లావియో కొబొల్లీని ఓడించి తన మొదటి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌. కానీ అతడు తేల్చుకోవాల్సిన పాత లెక్క ఒకటుంది. అదీ... ఆరేళ్ల కింద 2020 నాటి ఓ పాత కథ ఇది... అది 2020 నాటి యూఎస్‌ ఓపెన్‌. ఆరోజు 23 ఏళ్ల జ్వెరెవ్‌కి ప్రత్యర్థిగా ఆస్ట్రియాకు చెందిన డొమినిక్‌ థీమ్‌ ఆడుతున్నాడు. జ్వెరెవ్‌ మొదటి రెండు సెట్లూ గెలిచాడు. దాదాపుగా చేతికి అందేంత దగ్గర్లో ఒక గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ!! ఇక కావాల్సింది కేవలం రెండంటే రెండు పాయింట్లే!! కానీ... జ్వెరెవ్‌ ఆ తర్వాత మూడు సెట్లు కోల్పోయి ఓటమి పాలయ్యాడు. మళ్లీ ఆరేళ్ల తర్వాత... తేదీ 2026 సెప్టెంబర్‌ 13... న్యూయార్క్‌లోని ఆర్థర్‌ యాష్‌ స్టేడియం... పాతికవేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపాయిన స్టేడియం. ఒకవైపు అమెరికా యువ ఆటగాడు బెన్‌ షెల్టన్‌. ఆట జరుగుతున్నది న్యూయార్క్‌లోనే కావడంతో తమ దేశపు ఆటగాడే గెలవాలన్న కోరిక చాలామందిలో ఉండటం మామూలే. అందుకే... ‘దాదాపు 99.9% మంది ప్రేక్షకులు బెన్‌ షెల్టన్‌ గెలవాలని కోరుకుంటున్నారేమో’ అంటూ జ్వెరెవ్‌ సరదాగా ఓ కామెంట్‌ కూడా చేశాడు. చివరికి... తన ప్రత్యర్థి బెన్‌ షెల్టన్‌ను జర్మనీకి చెందిన 29 ఏళ్ల అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఓడించాడు. ఇప్పుడు జ్వెరెవ్‌ చేతిలో ట్రోఫీ! ఆరేళ్ల కిందట అతడు రన్నరప్‌. కానీ ఇప్పుడు చాంపియన్‌!! చుట్టూ ఎందరో ఫ్యాన్స్‌ ఉండవచ్చు. కానీ జ్వెరెవ్‌ మనసులో ఒకరున్నారు. ఒకరే ఉన్నారు. ఆ ఒకే ఒక వ్యక్తి ఆమె తల్లి ఇరీనా! అతడి మనసులో ఆ తల్లి అన్న మాటలూ ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవాలనుకుంటే జ్వెరెవ్‌కు నాలుగేళ్ల వయసప్పటి కాలానికి వెళ్లాలి. జ్వెరెవ్‌కు నాలుగేళ్ల వయసున్నప్పటి కథ ఇది... డాక్టర్‌ చెప్పాడు... ‘‘ఈ నాలుగేళ్ల చిన్నారికి టైప్‌–1 డయాబెటిస్‌’’ అని! అప్పుడు అతడి కుటుంబ సభ్యులు అడిగారు ‘‘ఇక ఈ పిల్లవాడి జీవితం ఎలా ఉంటుంది?’’ అని. ‘‘స్పోర్ట్స్‌ పర్సన్‌ కావాలనుకుంటే అది కష్టం కావచ్చు’’ అన్నాడు డాక్టర్‌. ఆయన ఈ మాట ఎందుకు అన్నాడంటే... జ్వెరెవ్‌ తల్లి ఇరీనా కూడా మాజీ టెన్నిస్‌ ప్లేయరే. ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలామంది పేరెంట్స్‌ సాధారణంగా ఏమంటారు? ‘‘సరే.... ముందు హెల్త్‌. ఆ తర్వాతే స్పోర్ట్స్‌...’’ అని. కానీ జ్వెరెవ్‌ తల్లి... ఇరీనా అలా అనుకోలేదు. ఆమె తన నాలుగేళ్ల కొడుకును చూసి... ‘‘నా కొడుకు భవిష్యత్తులో ఏమవ్వాలి అనేది టైప్‌–1 డయాబెటిస్‌ నిర్ణయించదు. అతడు టెన్నిస్‌ ప్లేయర్‌ కావాలంటే టెన్నిస్‌ ప్లేయర్‌. లేదా ఇంకేదైనా... మరేదైనా కావాలంటే అదీ’’. టైప్‌–1 డయాబెటిస్‌ కొనసాగింది... ప్రతిరోజూ గుచ్చే సూదులూ... రోజూ తాను కళ్లజూసే రక్తపుబొట్లు... రోజు వాడాల్సిన మందులతో! కానీ జీవితమూ కొనసాగింది. అదీ అతడి ఇష్టప్రకారమే... ప్రాక్టీస్‌... ఫిట్‌నెస్‌... మ్యాచులు. ప్రయాణాలూ... విజయాలతో! తన చిన్నప్పటి నుంచీ టైప్‌–1 డయాబెటిస్‌ కండిషన్‌తోనే.. ఎన్నో కండిషన్ల మధ్యన అతడు జీవిస్తున్నాడు. టెప్‌–1 డయాబెటిస్‌ అంటే ఏమిటో, దానితో జీవితమెలా ఉంటుందో చూద్దాం... టైప్‌–1 డయాబెటిస్‌ అంటే...? పిల్లల్లో వచ్చే డయాబెటిస్‌ను టైప్‌–1 డయాబెటిస్‌ అంటారు. చిన్నారుల్లో వస

Original source: sakshi.com
Read more on Kaizer News