ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ల గురించి ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఇండియా నుంచి తాను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన బ్యాటర్‌గా దిగ్గజ టెస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను ఎంపిక చేశాడు. ప్రైమ్ వీడియో స్పోర్ట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన కమిన్స్, పుజారా క్రీజులో చూపించే పట్టుదల, సహనం ప్రత్యర్థి బౌలర్లకు నిజమైన నరకం చూపిస్తాయని పేర్కొన్నాడు. "ఇండియా విషయానికి వస్తే నేను కచ్చితంగా పుజారా పేరే చెబుతాను. అతడిని ఔట్ చేయడం చాలా కష్టం. అది వెయ్యి పేపర్ కట్లతో చంపేసినట్లు ఉంటుంది. కావాలనుకుంటే వంద డాట్ బాల్స్ అయినా ఎలాంటి విసుగు లేకుండా ఆడతాడు. బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వడు" అని కమిన్స్ తెలిపాడు. Read Also: Domestic Pay Hike: డొమెస్టిక్ మ్యాచ్ అఫీషియల్స్‌కు బీసీసీఐ శుభవార్త.. అంపైర్ల ఫీజులు భారీగా పెంపు, కొత్త గ్రేడేషన్ సిస్టమ్ అమలు తనే కఠిన బౌలర్.. పాకిస్తాన్ నుంచి మాజీ మిస్టరీ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌ను అత్యంత కఠినమైన బౌలర్‌గా కమిన్స్ తెలిపాడు. తాను క్రీజులోకి రాగానే ఓవర్ ఆఖరి బంతికి అజ్మల్ విసిరిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యానని, అలాంటి బౌలింగ్ తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని గుర్తుచేసుకున్నాడు. వీరితో పాటు ఇంగ్లాంReడ్ నుంచి అలిస్టర్ కుక్, సౌతాఫ్రికా నుంచి ఏబీ డివిలియర్స్, న్యూజిలాండ్ నుంచి బ్రెండన్ మెకల్లమ్, శ్రీలంక నుంచి తిలకరత్నే దిల్షాన్, వెస్టిండీస్ నుంచి క్రిస్ గేల్‌లను ఆయా దేశాల నుంచి అత్యంత కఠినమైన ప్రత్యర్థులుగా ఎంపిక చేశాడు. కమిన్స్ ఎంచుకున్న ఈ జాబితాలోని ఆటగాళ్లందరూ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినవారే కావడం విశేషం.. Read Also: Abhishek Sharma Century Celebrations: 30 బంతుల్లోనే విధ్వంసంక సెంచరీ, మెడిటేషన్ సెలబ్రేషన్ తో దుమ్మురేపిన అభిషేక్ ద్రవిడ్ తర్వాత ఆ పేరు తెచ్చుకున్న దిగ్గజం.. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పుజారా, భారత్ తరఫున 103 టెస్టుల్లో 43.60 సగటుతో 7,195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐదు వన్డేల్లోనూ ప్రాతినిధ్యం వహించి 51 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాలు సాధించడంలో పుజారా క్రీజులో గంటల తరబడి పాతుకుపోయి ఆడిన ఇన్నింగ్స్‌లే కీలక పాత్ర పోషించాయి. అతడి డిఫెన్స్ ముందు కంగారూ పేసర్లు ఎన్నోసార్లు అసహనానికి గురయ్యిన సంగతి తెలిసిందే. క్రీజులో పాతుకుపోయి, బౌలర్లను అసహనానికి గురిచేసి, ద వాల్ గా పేరు తెచ్చుకున్న మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తర్వాత ఆ స్థాయిలో పుజారా పేరు తెచ్చుకున్నాడు. సౌతాఫ్రికా టూర్‌కు ఆసీస్ రెడీ.. బాల ట్యాంపరింగ్ తర్వాత తొలిసారి.. ప్రస్తుతం జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా, అనంతరం సౌతాఫ్రికాలో పర్యటించనుంది. అక్కడ మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడనుంది. కమిన్స్ వన్డే మ్యాచ్‌ల సమయానికి జట్టుతో కలుస్తాడు. అక్టోబర్ 9 నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవనుంది. 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత సౌతాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా ఆడనున్న తొలి రెడ్ బా