Shorts AP: అమరావతి కేంద్రంగా మరోసారి విమానయాన ఖర్చుల వ్యవహారం రాజకీయ చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారిక పర్యటనలకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని.. APACLకు సంబంధించిన ఖర్చులను మొత్తం సీఎం వ్యక్తిగత పర్యటనల ఖర్చులుగా చూపించడం సరికాదని అధికారులు స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పవన్, లోకేష్ పర్యటనలకు ఖర్చు లేదంటున్న అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ అధికారిక పర్యటనలకు APACL నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా లోకేష్ విమాన ప్రయాణాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు గతంలోనే RTI సమాధానాలు కూడా తెరపైకి వచ్చాయి. సంబంధిత శాఖల నుంచి అందిన సమాచార ప్రకారం హైదరాబాద్ పర్యటనలకు తమ శాఖల నుంచి ఎలాంటి చెల్లింపులు జరగలేదని వెల్లడైంది. APACL బడ్జెట్ అంటే కేవలం ముఖ్యమంత్రి పర్యటనల కోసం కేటాయించిన నిధులు కాదని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర మంత్రులు, ఇతర అధికారిక అవసరాలకు హెలికాప్టర్, ప్రత్యేక విమాన సేవలు అందించడం, అత్యవసర పరిస్థితుల్లో విమానయాన సేవలు వినియోగించడం వంటి అనేక అంశాలు ఇందులో ఉంటాయని చెబుతున్నాయి. అందువల్ల APACL మొత్తం బడ్జెట్‌ను సీఎం పర్యటనల ఖర్చుగా చూపడం వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించదని అధికారులు అంటున్నారు. రాష్ట్రానికి గవర్నర్, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖుల అధికారిక పర్యటనలు ఉన్నప్పుడు కూడా హెలికాప్టర్ సేవలను వినియోగించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భద్రత, సమయపాలన, ఒకే రోజులో పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించాల్సిన సందర్భాల్లో విమానయాన సేవలు ఉపయోగపడుతున్నాయని వివరిస్తున్నాయి. APACL పరిధిలో అత్యవసర సేవలకు సంబంధించిన విమానయాన అవసరాలు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవల కోసం ఎయిర్ అంబులెన్స్ వినియోగం కూడా ఈ వ్యవస్థలో భాగమేనని వివరిస్తున్నారు. కాబట్టి విమానయాన ఖర్చులను కేవలం రాజకీయ పర్యటనలతో ముడిపెట్టడం సరికాదన్నది ప్రభుత్వ వాదన. నేపాల్ నుంచి తెలుగువారి తరలింపునకు ప్రత్యేక విమానం 2025లో నేపాల్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సమయంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. అప్పట్లో 144 మంది తెలుగు వారిని ప్రత్యేక విమానంలో విశాఖపట్నం, తిరుపతికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. అంటే APACL తరహా విమానయాన వ్యవస్థను కేవలం ముఖ్యమంత్రి ప్రయాణాల కోసమే ఉపయోగించడం లేదని ప్రభుత్వం చెబుతోంది. అత్యవసర పరిస్థితులు, ప్రజల తరలింపు, అధికారిక అవసరాలు వంటి సందర్భాల్లో కూడా ఈ సేవలు వినియోగించాల్సి ఉంటుందని వివరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటనలను