Kaizer News

టీమిండియా vs దునియా..

టీమిండియా vs దునియా..

· National - India · prabhanews.com

బీసీసీఐ శతాబ్ది వేడుకల్లో స్టార్‌ వార్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పూనకాలే! భారత్‌ బెస్ట్‌ ప్లేయర్లు ఒకవైపు.. ప్రపంచ స్టార్‌ క్రికెటర్లు మరోవైపు.. 2028లో మెగా మ్యాచ్‌కు BCCI ప్లాన్‌? ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : టీమిండియాలోని బెస్ట్‌ ప్లేయర్లు ఒక జట్టుగా.. ప్రపంచంలోని టాప్‌ క్రికెటర్లు మరో జట్టుగా బరిలోకి దిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి… స్టేడియం మొత్తం ఫుల్‌ క్రౌడ్‌.. ప్రతి బాల్‌కు అరుపులు.. ప్రతి షాట్‌కు సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇది ఓ భారీ ట్రీట్‌ అవుతుంది. ఇలాంటి ఓ మెగా క్రికెట్‌ షోకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్న సందర్భంగా టీమిండియా ఎలెవన్‌ vs రెస్ట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఎలెవన్‌ మధ్య ఓ చారిత్రక మ్యాచ్‌ నిర్వహించే ఆలోచనపై చర్చ జరిగినట్లు సమాచారం. అయితే ఈ మ్యాచ్‌ ఇంకా ఫైనల్‌ కాలేదు. జట్ల ఎంపిక, మ్యాచ్‌ ఫార్మాట్‌, వేదిక, తేదీ వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉన్న ప్రతిపాదన మాత్రమే. అయినప్పటికీ, దీనికి సంబంధించిన వార్తలు బ‌య‌టికి రావడంతో క్రికెట్ అభిమానులు క్రికెట్ ఫ్యాన్స్ ఉర్రూతలూగుతున్నారు ప్రపంచ క్రికెట్‌లో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ప్రయాణం ఇప్పుడు ప్రత్యేక స్థాయికి చేరుకుంది. 1928లో ప్రారంభమైన బీసీసీఐ.. కాలక్రమేణా ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన క్రికెట్‌ బోర్డుల్లో ఒకటిగా ఎదిగింది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న భారీ ఆదరణ, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) విజయవంతం కావడం, భారీ మార్కెట్‌, కోట్లాది మంది అభిమానులు ఉండటంతో బీసీసీఐ ఆర్థికంగా కూడా అత్యంత బలమైన సంస్థగా మారింది. కాగా, భారత క్రికెట్‌ చరిత్రలో బీసీసీఐకి 2028 ప్రత్యేకమైన సంవత్సరం కానుంది. 1928 డిసెంబర్‌లో ఢిల్లీలోని రోషనారా క్లబ్‌లో ప్రారంభమైన బీసీసీఐ.. 2028లో తన 100 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా 2027 డిసెంబర్‌ నుంచి 2028 వరకు ఏడాది పాటు శతాబ్ది వేడుకలు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత క్రికెట్‌ ప్రయాణాన్ని గుర్తు చేసే కార్యక్రమాలు, ప్రత్యేక ఈవెంట్లు, అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లు ఈ వేడుకల్లో భాగంగా ఉండే అవకాశం ఉంది. టీమిండియా తరఫున అత్యుత్తమ ఆటగాళ్లతో ఓ జట్టు.. ప్రపంచంలోని బెస్ట్‌ ప్లేయర్లతో మరో జట్టు.. ఈ రెండు టీమ్స్‌ తలపడితే అది సాధారణ మ్యాచ్‌ కాదు.. ఓ గ్లోబల్‌ క్రికెట్‌ ఫెస్టివల్‌లా మారే అవకాశం ఉంది. భారత్‌ నుంచి స్టార్‌ బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు ఒకే టీమ్‌లో కనిపిస్తే.. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇతర దేశాల టాప్‌ ఆటగాళ్లు ప్రత్యర్థిగా ఉంటే అభిమానులకు అసలైన క్రికెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ దక్కనుంది. వరల్డ్‌ ఎలెవన్‌ తరహా ప్రత్యేక మ్యాచ్‌లు క్రికెట్‌లో కొత్త కాదు. గతంలో ఎంసీసీ ఆధ్వర్యంలో రెస్ట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ జట్లతో పలు ప్రత్యేక మ్యాచ్‌లు జరిగాయి. 2014లో లార్డ్స్‌లో జరిగిన ప్రత్యేక మ్యాచ్‌లో క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, షేన్‌ వార్న్‌ వంటి ఆటగాళ్లు పాల్గొన్నారు. అదే తరహాల

Original source: prabhanews.com
Read more on Kaizer News