Kaizer News

Rudrur: 2 లక్షల గరికతో వినాయకుడికి విశేష అలంకరణ

Rudrur: 2 లక్షల గరికతో వినాయకుడికి విశేష అలంకరణ

· State - Telangana · hmtvlive.com

Shorts నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండపంలో కొలువుదీరిన గణనాథుడిని ఆదివారం రెండు లక్షల గరికలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి రాము శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి నిర్వాహకులు, సభ్యులు, మహిళలు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News