Kaizer News

తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు... గరుడ వ

తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు... గరుడ వాహనంపై భక్తులను కటాక్షించిన మలయప్పస్వామి..

· State - Telangana · v6velugu.com

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం ( సెప్టెంబర్ 19 ) గరుడ వాహన సేవ ఘ్నంగా నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన భక్తాదుల గోవింద నామస్మరణతో తిరుమల మాడవీధులు మార్మోగాయి. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు భక్తిభావంతో సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవిందా.. గోవిందా అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. 108 వైష్ణవ దివ్యదేశాల్లో గరుడసేవకు అత్యంత విశిష్టమైన ప్రాధాన్యం ఉందని... గరుడుడు జ్ఞాన, వైరాగ్యాలకు ప్రతీకగా భావించబడతాడని చెబుతున్నారు పండితులు. గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం సర్వపాప ప్రాయశ్చిత్తానికి, జ్ఞానవైరాగ్య ప్రాప్తికి దోహదం చేస్తుందని భక్తుల విశ్వాసం. ఈ గరుడసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, జేఈవోలు శరత్, ప్రభల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News