Kaizer News

బాబూ... చెత్త ఎవరిది? సోషల్‌ మీడియాలో రివర్స్‌ కౌం

బాబూ... చెత్త ఎవరిది? సోషల్‌ మీడియాలో రివర్స్‌ కౌంటర్‌!

· State - Telangana · sakshi.com

ఏ పీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు భలే ప్రకటనలు చేస్తుంటారు. వాటిని ఎల్లో మీడియా పరమ పవిత్రం అన్నట్లుగా ప్రముఖంగా ప్రచురించి ప్రచారం చేస్తుంటుంది. చంద్రబాబు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. అది ఏమిటంటే రాజకీయాలలో చెత్తను తొలగిద్దాం.. అని అన్నారు. మామూలుగా అయితే ఇది ఆహ్వానించదగిందే. కాని ఆయన లక్ష్యం వేరు. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన అనుకోవచ్చేమోకాని, వాటిని విన్నవెంటనే, పత్రికలలో చదివిన వెంటనే గుర్తుకు వచ్చేది అధికార పార్టీలో ఉండేవారు చేసే అక్రమాల గురించే కదా! ఆ విషయాన్ని ఆయన పట్టించుకోకుండా స్పీచ్‌లు ఇస్తుండడం విశేషం. మనం రాజకీయాలలో ఉన్నవారిని అలాంటి పదాలతో సంభోధించడం సరైన పద్దతి కాదు. ఎవరు తప్పు చేసినా తప్పే. అసలు రాజకీయాలలో చెత్త అంటే ఏమిటో ఆయన ఒక నిర్వచనం ఇస్తే బాగుంటుంది కదా! ఎవరిపైన కేసులు ఉంటే వారు ఆ కోవలోకి వస్తారని అన్న భావనా? లేక ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే దానిని ఆ విధంగా పరిగణించాలన్న అర్థమా? ఎన్నికలలో డబ్బు ఖర్చు చేసేవారిపై వ్యాఖ్యలా? ఒక విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఈ స్పీచ్ ఇవ్వడానికి రెండు రోజుల ముందు జాతీయ స్థాయిలో ప్రజస్వామ్య సంస్కరణల వేదిక ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ఏమి ఉంది? ఏపీలో 79 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయనే కదా! అంటే అత్యధిక సంఖ్యలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల మీదే కదా! నేర చరిత్ర కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబుది నాలుగో స్థానం అని అందులో ప్రకటించారు. ఈయనపై 19 క్రిమినల్ కేసులు ఉంటే, కొన్ని తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని రిపోర్టు చెబుతుంది. ఆయన శిష్యుడుగా గుర్తింపు పొందిన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు ఉన్నాయట. ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. వీటిలో పెక్కు రాజకీయపరమైన కేసులు ఉండవచ్చని వీరు వాదించవచ్చు. కాని ఎదుటి పక్షాలపై అలాంటి కేసుల ఆధారంగానే చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటారే! అక్కడే వచ్చింది సమస్య. తాను ఎవరిపైన ఆరోపణ చేస్తే అందులో నిజం ఉందని అనుకోవాలన్నది ఆయన భావన. అదే తనపై ఎవరైనా ఆరోపణ చేస్తే ఎవరూ నమ్మకూడదన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎంతసేపు ఎదుటివారిపై బురద వేయడమే పనిగా పెట్టుకున్నప్పుడు ఆ బురద తమపై కూడా పడే అవకాశం ఉంటుందని వారు గుర్తించాలి కదా! తనకు మీడియా బలం ఉంది కనుక తను చెప్పిందే జనంలోకి వెళుతుందని చంద్రబాబు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనకే నష్టం. ఇవి కూడా చదవండి: వైఎస్‌ జగన్‌ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..! చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఆయనను ఎద్దేవ చేస్తూ అనేక విషయాలను ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్‌తో పోస్టులు వస్తున్నాయి. గొడ్డలి పార్టీ అని వైఎస్సార్‌సీపీని అంటూ తన పార్టీని వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పిలిపించుకుంటున్నారు. మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు చాలా అనుచితంగా ఉంటున్నాయి. చంద్రబాబు తన హోదాను, సీనియారిటీని కూడా మర్చిపోయి ఏది పడితే అది ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ప్రజలు నిజాయితీగా ఉంటే నాయకులు తప్పులు చేయరట. ఎన్నికలలో డబ్బు ప్రభావం ల

Original source: sakshi.com
Read more on Kaizer News