Kaizer News

Iran-7-Conditions-Us-Talks : ఇరాన్‌ 7 షరతులు! Andh

Iran-7-Conditions-Us-Talks : ఇరాన్‌ 7 షరతులు! Andhra Prabha Top News

· National - India · prabhanews.com

ఇరాన్‌ 7 షరతులు! Andhra Prabha Top News యుద్ధానికి ముగింపు పలకాలని ఓవైపు దౌత్య ప్రయత్నాలు.. మరోవైపు అమెరికా దాడి చేస్తే దీటుగా బదులిస్తామంటూ సైనిక సన్నద్ధత! ఇరాన్‌ ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహం ఇదే. అమెరికాతో చర్చలు ప్రారంభించేందుకు ఏడు షరతులను ఖతార్‌ మధ్యవర్తుల ద్వారా వాషింగ్టన్‌కు చేరవేసినట్లు ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి మొహసేన్‌ రెజాయీ వెల్లడించారు. తమ డిమాండ్లను అమెరికా అంగీకరించకపోతే ‘నిర్ణయాత్మక యుద్ధానికి’ సిద్ధమని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో యుద్ధానికి ముగింపు, స్తంభింపజేసిన ఇరాన్‌ నిధుల విడుదల, నావికా దిగ్బంధం ఎత్తివేత.. ఇవి తమ షరతుల్లో ఉన్నాయని రెజాయీ పేర్కొన్నారు. అయితే, ఏడు షరతుల పూర్తి వివరాలను వెల్లడించలేదు. వాషింగ్టన్‌ ఈ డిమాండ్లను అంగీకరించడమే ప్రయోజనకరమని, ట్రంప్‌ బెదిరింపులతో ఎలాంటి ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ముగించాలన్న లక్ష్యంతో ఖతార్‌తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, తమ షరతులను అమెరికాకు చేరవేశామని అల్‌జజీరాకు తెలిపారు. గత నెలలో అవగాహన ఒప్పందం గడువు ముగిసినప్పటి నుంచి తెహ్రాన్‌–వాషింగ్టన్‌ మధ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఖతార్‌, పాకిస్థాన్‌ ప్రయత్నిస్తున్నట్లు అల్‌జజీరా తెలిపింది. ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి కొనసాగుతున్న ఘర్షణకు ముగింపు పలికేందుకు ప్రాంతీయ దేశాలూ కృషి చేస్తున్నాయి. చర్చల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ యుద్ధం ఇంకా ముగిసినట్లు కాదని రెజాయీ స్పష్టం చేశారు. “ఆచరణలో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది” అని పేర్కొంటూ.. వీలైనంత త్వరగా సంఘర్షణకు ముగింపు పలకడమే తమ వ్యూహమని తెలిపారు. అమెరికా మరోసారి దాడి చేసే అవకాశాన్ని రెజాయీ తోసిపుచ్చలేదు. ఇరాన్‌ సైనిక అంచనాల ప్రకారం అలాంటి పరిణామం సంభవించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. గతంలో జరిగిన రెండు విడతల ఘర్షణల అనంతరం తమ సైనిక ప్రణాళికలను మార్చుకున్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌, అరేబియా సముద్రం వరకు ఉన్న అమెరికా నావికాదళ ఆస్తులపై ప్రస్తుతం తమ వ్యూహాత్మక దృష్టి కేంద్రీకృతమైందని రెజాయీ వెల్లడించారు. ఇటీవల అమెరికా నౌక లేదా విమాన వాహక నౌక సమీపంలో బహుళ వార్‌హెడ్‌లతో కూడిన నౌకా విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో అమెరికా దాడి చేస్తే ఇరాన్‌ ప్రతిస్పందన విస్తృతంగా ఉండొచ్చని హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలతోపాటు, అమెరికా వాణిజ్య ప్రయోజనాలు, స్థానికంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలూ లక్ష్యాలుగా మారే అవకాశముందని తెలిపారు. ఇవన్నీ ఇరాన్‌ అధికారి చేసిన వాదనలు కాగా, స్వతంత్రంగా ధ్రువీకరించిన వివరాలు అందుబాటులో లేవు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) నుంచి వైదొలగాలని ఇరాన్‌ ఇప్పటివరకు నిర్ణయించలేదని రెజాయీ తెలిపారు. అయితే, అమెరికా చర్యలు తమను అలాంటి నిర్ణయం వైపు నెట్టే ప్రమాదం ఉందని హ

Original source: prabhanews.com
Read more on Kaizer News