Kaizer News

కొల్లాపూర్‌కు తరలివచ్చిన ఉమ్మడి పాలమూరు గులాబీ దండ

కొల్లాపూర్‌కు తరలివచ్చిన ఉమ్మడి పాలమూరు గులాబీ దండు

· State - Telangana · prabhanews.com

మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి మృతికి నివాళులు చిన్నంబావి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి (85) వృద్ధాప్య, అనారోగ్య కారణాలతో శుక్రవారం కొల్లాపూర్‌లోని తన నివాసంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకులు, ఉమ్మడి పాలమూరు ప్రాంతానికి చెందిన గులాబీ దండు కొల్లాపూర్‌కు తరలివచ్చింది. అలంపూర్‌ శాసనసభ్యుడు విజయుడు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు లక్ష్మారెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తుది అంత్యక్రియల్లో పాల్గొని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మారెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర నాయకులు విజయ్‌, అభిలాషరావు తదితరులు కూడా పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు హాజరయ్యారు

Original source: prabhanews.com
Read more on Kaizer News