Kaizer News

ఫిరాయింపుల ప్రభుత్వానికి చెంపపెట్టు: సిరికొండ

ఫిరాయింపుల ప్రభుత్వానికి చెంపపెట్టు: సిరికొండ

· State - Telangana · ntnews.com

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి హైకోర్టు వెల్లడించిన తీర్పు గట్టి చెంపపెట్టని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. చట్టసభల హుందాతనాన్ని, రా జ్యాంగ నిబంధనలను, ప్రజాస్వామ్య విలువలను కా పాడేలా న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అత్యంత అభినందనీయమని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేరొన్నారు. ఇతర పార్టీల నేతలు ఎవరైనా కాంగ్రెస్‌లోకి రావాలంటే పదవులకు రాజీనామా చేసిన తర్వాతే చేరాలని ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి సన్నా యి నొకులు నొకారని గుర్తుచేశారు. తీరా గద్దెనెకాక నైతిక విలువలను గాలికి వదిలేసి, స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఆయన స్వయం వైరుధ్యానికి ప్రత్యక్ష నిదర్శనమని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకొని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని ప్రస్తావించారు. అయినప్పటికీ సాంకేతికంగా తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటూ దానం బుకాయించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. చట్టసభల గౌరవాన్ని, ధర్మాన్ని నిలబెట్టడంలో స్పీకర్‌ విఫలమైన వేళ, అన్ని వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు న్యాయాన్ని రక్షించిందని స్పష్టం చేశారు. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలందరూ అనర్హత వేటుకు గురికావడం ఖాయమని అన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News