Kaizer News

2036 ఒలింపిక్స్‌‌ బిడ్‌‌పై కేంద్ర హోం మంత్రి అమిత్

2036 ఒలింపిక్స్‌‌ బిడ్‌‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా సమీక్ష

· State - Telangana · v6velugu.com

అహ్మదాబాద్‌‌: 2030 కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌ సన్నాహాలతో పాటు 2036 ఒలింపిక్స్‌‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇండియా చేస్తున్న ప్రయత్నాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. క్రీడల నిర్వహణలో భద్రతా ఏర్పాట్లు, ఇతర నిర్వహణ పరమైన అంశాల పర్యవేక్షణపై చర్చలు జరిపారు. ‘అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఇండియాను ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. అహ్మదాబాద్‌‌లో 2030 ఒలింపిక్‌‌ బిడ్‌‌, 2029 పోలీస్, ఫైర్‌‌ గేమ్స్‌‌, 2030 కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌ నిర్వహణ సన్నాహాలపై సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించాను’ అని షా ఎక్స్‌‌లో ట్వీట్‌‌ చేశారు. రెండు దశాబ్దాల తర్వాత కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌కు ఇండియా ఆతిథ్యమివ్వబోతున్నది. 2010లో ఢిల్లీలో జరిగిన మెగా గేమ్స్‌‌ ఇప్పుడు అహ్మదాబాద్‌‌లో జరగనున్నాయి. ఇక 2036 ఒలింపిక్స్‌‌ను నిర్వహించే దేశాల రేసులో అహ్మదాబాద్‌‌ కూడా ఉంది. దాంతో గుజరాత్‌‌ డిప్యూటీ సీఎం హర్ష్‌‌ సంఘవి అంతర్జాతీయ ఒలింపిక్‌‌ కమిటీతో జరిగే చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2029కు ముందు ఎటువంటి నిర్ణయం వెలువడే చాన్స్‌‌ లేకపోవడంతో ప్రస్తుతానికి నిరంతరాయంగా చర్చలు జరుపుతున్నారు. కేంద్ర క్రీడల మంత్రి మనుసుఖ్‌‌ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు

Original source: v6velugu.com
Read more on Kaizer News