Kaizer News

చరిత్ర సృష్టించిన పోలార్డ్‌

చరిత్ర సృష్టించిన పోలార్డ్‌

· Sports · sakshi.com

వెస్టిండీస్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పోలార్డ్‌ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తిరిగి అవతరించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌-2026లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్చ్‌లో (ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అతడు.. ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు బట్లర్‌ (14890 పరుగులు) పేరిట ఉండిన రికార్డు బద్దలు కొట్టేందుకు 35 పరుగులు అవసరం కాగా.. కేవలం 26 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. దీంతో టీ20ల్లో పోలార్డ్ పరుగుల సంఖ్య 14921కు చేరింది. 749 మ్యాచ్‌ల్లో 666 ఇన్నింగ్స్‌ల ద్వారా అతడు ఈ పరుగులు సాధించాడు. 2026లో అత్యధిక టీ20 పరుగుల రికార్డు పలుమార్లు చేతులు మారింది. తొలుత క్రిస్ గేల్‌ను అధిగమించి పోలార్డ్ రికార్డు సాధించగా, ఆగస్టు 6న ది హండ్రెడ్‌లో బట్లర్ అతడిని వెనక్కి నెట్టాడు. తాజాగా పోలార్డ్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 1000 సిక్సర్ల క్లబ్‌లోపోలార్డ్ సెయింట్ లూసియా కింగ్స్‌పై కొట్టిన ఐదు సిక్సర్లతో టీ20ల్లో పోలార్డ్‌ సిక్సర్ల సంఖ్య 1010కి చేరింది. పొట్టి ఫార్మాట్‌లో 1000కుపైగా సిక్సర్లు బాదిన బ్యాటర్లుగా పోలార్డ్, క్రిస్ గేల్ మాత్రమే ఉన్నారు. గేల్ 1057 సిక్సర్లతో ముందంజలో ఉండగా, పోలార్డ్ గేల్‌ను అధిగమించేందుకు మరో 48 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. 15000 పరుగులపై కన్ను టీ20ల్లో 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా మరో చరిత్ర సృష్టించేందుకు పోలార్డ్‌కు మరో 79 పరుగులు కావాలి. ప్రస్తుత CPL సీజన్‌లోనే అతడు ఈ మైలురాయిని తాకే అవకాశం ఉంది. 39 ఏళ్ల వయసులోనూ పోలార్డ్‌ ఈ స్థాయిలో రికార్డులు బద్దలు కొడుతుండటం అసాధారణంగా ఉంది. అతడు పొట్టి ఫార్మాట్‌లో బౌలర్‌గానూ మంచి రికార్డు కలిగి ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో పోలార్డ్‌ 339 వికెట్లతో లీడింగ్‌ వికెట్‌ టేకర్ల జాబితాలో 36వ స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: టీ20 క్రికెట్‌లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నమీబియా హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) యువతకు తోడుగా నేనుంటా..! కూటమిపై రాచమల్లు అల్లుడు ఫైర్ గురు శిష్యుల చీకటి ఒప్పందంతో రాయలసీమ తాకట్టు.. శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు తాగడానికి నీళ్లు లేవు కానీ.. డ్రగ్స్ మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి చంద్రబాబు పేరు చెప్తుంటే సల సల మండిపోతున్నారు

Original source: sakshi.com
Read more on Kaizer News