Kaizer News

Pendurthi: పెందుర్తిలో ఘోర విషాదం ఆటో డ్రైవర్ కుటు

Pendurthi: పెందుర్తిలో ఘోర విషాదం ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య!

· State - Telangana · hmtvlive.com

Pendurthi: పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్తవలసకు చెందిన మల్ల ప్రవీణ్ కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా నిన్న కుటుంబ సభ్యులకు రాఖీలు కట్టించుకున్న ప్రవీణ్ కుమార్ రాత్రి సమయంలో సెల్‌ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ‘RIP’ అంటూ సందేశం పంపినట్లు సమాచారం.ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ అతని భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య కి పాల్పడినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందారు. రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన అనంతరం చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కుటుంబ పరిస్థితులు, ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News