Anakapalli: ఇటీవల జరిగిన జార్జి క్లబ్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ అధ్యక్షుడు దాడి బుజ్జి, సెక్రటరీ కొణతాల మురళితో పాటు కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అభినందించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జార్జి క్లబ్ అభివృద్ధితో పాటు సభ్యుల సంక్షేమానికి నూతన కార్యవర్గం మరింత కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. క్లబ్‌కు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను కాపాడుతూ, సభ్యులందరినీ కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. నూతన కార్యవర్గం తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జార్జి క్లబ్‌కు మరింత గుర్తింపు తీసుకురావాలని కొణతాల రామకృష్ణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జార్జి క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులతో పాటు పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు