Shorts Nellore: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పాతనాపురం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న రూ.10,190 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఈదాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసి,నిందితులపై కేసు నమోదు చేసినట్లు కలిగిరి ఎస్సై తెలిపారు. కలిగిరి మండల పరిధిలో పేకాట, జూదం,ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎక్కడైనా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తామని ఎస్సై తెలిపింది